శ్రమ నీ ఆయుధమైతే విజయం నీ బానిస అవుతుంది..

– ఎస్ఆర్ ఫౌండేషన్ అధ్యక్షురాలు మహమ్మద్ సుల్తాన ఉమర్.
నవతెలంగాణ -రాయపోల్
శ్రమ నీ ఆయుధమైతే విజయం నీ బానిసవుతుందని, విద్యార్థులు పట్టుదలతో చదివితే వారు ఎంచుకున్న లక్ష్యాన్ని సాధించుతరని అలా ప్రతి ఒక్కరు జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలని ఎస్ఆర్ ఫౌండేషన్ అధ్యక్షురాలు, సామాజిక ప్రజాసేవకురాలు మహమ్మద్ సుల్తాన ఉమర్ అన్నారు. గురువారం దౌల్తాబాద్ మండలం ఇందు ప్రియాల్ గ్రామంలో నూతనంగా పోలీసు ఉద్యోగానికి ఎంపికైన మహమ్మద్ మోఖీద్ ను ఘనంగా సత్కరించి బహుమతి ప్రధానం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు ప్రతి ఒక్కరూ బాల్య దశనుండే జీవితంలో ఏం కావాలనుకుంటున్నారో లక్ష్యాన్ని ఎంచుకోవాలని, ఆ లక్ష్యం సాధించే దిశలో విద్యతోపాటు క్రమశిక్షణ, వినయంతో చదివితే జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకుంటారన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు ఎంతో శ్రమకు ఓర్చి విద్యార్థుల బంగారు భవిష్యత్తు పై కలలు కంటూ కష్టపడి చదివిస్తుంటారని,వారి కలలను నిజం చేస్తూ తల్లిదండ్రులకు పేరు తీసుకురావాలన్నారు. దౌల్తాబాద్ మండలం ఇందు ప్రియాల్ గ్రామానికి చెందిన మహమ్మద్ మోఖీద్ నిరుపేద కుటుంబంలో జన్మించినప్పటికీ తన పేదరికాన్ని చదువుకు అడ్డు రాకుండా కష్టపడి చదువుకొని పోలీస్ ఉద్యోగం సాధించడం వారి తల్లిదండ్రులకు, గ్రామానికి ఎంతో పేరు తీసుకురావడం గర్వంగా ఉందన్నారు. ఎస్ఆర్ ఫౌండేషన్ తరపున మొఖీద్ ను ఘనంగా సత్కరించి అభినందనలు తెలియజేయడం జరిగిందన్నారు.ఈ కార్యక్రమంలో ఎస్ఆర్ ఫౌండేషన్ ప్రధాన కార్యదర్శి పుట్ట రాజు, మోహిత్ తల్లిదండ్రులు మహమ్మద్ సాలేహ, బాబు జానీ,కుటుంబ సభ్యులు రిజ్వాన,ప్యారి బేగం, మహబూబ్ సాబ్ తదితరులు పాల్గొన్నారు.