బీఆర్‌ఎస్‌ను గెలిపిస్తే బీజేపీకి తాకట్టు పెడతాడు

– బీఆర్‌ఎస్‌ అభ్యర్థి అవినీతి సొమ్ముతో గెలవాలని చూస్తున్నాడు
– బీఆర్‌ఎస్‌కు ఓటు అడిగే నైతిక హక్కు లేదు
– 14 స్థానాల్లో కాంగ్రెస్‌ పార్టీ గెలవడం ఖాయం
– నీలం మదులు గెలిపించి రాహుల్‌ గాంధీకి కానుకగా ఇవ్వాలి
– దేవాదాయ అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ
నవ తెలంగాణ-నర్సాపూర్‌
పార్లమెంట్‌ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ పార్టీని గెలిపిస్తే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ బీజేపీకి తాకట్టు పెడతాడని దేవాదాయ, అటవీ శాఖ మంత్రి కొండ సురేఖ అన్నారు. మెదక్‌ జిల్లా నర్సాపూర్‌ పట్టణంలోని సాయి కష్ణ గార్డెన్‌లో కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం నియోజకవర్గ స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రి కొండా సురేఖ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ వచ్చే పార్లమెంట్‌ ఎన్నికల్లో 17 ఎంపీ స్థానాల్లో 14 ఎంపీ స్థానాలు కాంగ్రెస్‌ పార్టీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. మెదక్‌ పార్లమెంట్‌ స్థానంలో బీసీ బిడ్డ నీలం మధు ముదిరాజును కాంగ్రెస్‌ పార్టీ అధిష్టానం ఎంపీ అభ్యర్థిగా పోటీలో నిలిపినందున ఈ ప్రాంతంలోని బీసీలు ఏకతాటిపై నిలబడి నీలం మధు ముదిరాజును గెలిపించాలన్నారు. బీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థి అవినీతి సొమ్ముతో ఎన్నికల్లో గెలవాలని ప్రయత్నిస్తున్నారని, ఆయన చేస్తున్న కుట్రలను ప్రతి కాంగ్రెస్‌ కార్యకర్త తిప్పికొట్టాలన్నారు. బీఆర్‌ఎస్‌ పార్టీకి ఓటు వేస్తే బీజేపీకి ఓటు వేసినట్లేనన్నారు. బీఆర్‌ఎస్‌ పార్టీ 10 సంవత్సరాల పాలనలో ఇచ్చిన హామీలను ఏ ఒక్కటి కూడా సక్రమంగా అమలు పరచలేదని, కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే ఇచ్చిన హామీలను నెరవేర్చిందన్నారు. అనంతరం ఎంపీ అభ్యర్థి నీలం మధు మాట్లాడుతూ నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన తనను ప్రజలు ఎంపీగా గెలిపిస్తే పార్లమెంటులో చర్చించి అధిక నిధులు తీసుకువచ్చి ఈ ప్రాంతాన్ని అభివద్ధి చేస్తానన్నారు. మెదక్‌ ఎంపీ స్థానం నుంచి కాంగ్రెస్‌ అధినేత్రి స్వర్గీయ ఇందిరాగాంధీ గెలుపొంది ప్రధానమంత్రి అయిన ఎంపీ స్థానం నుంచి తాను ఎంపీగా నిలబడే అవకాశం దక్కడం తన పూర్వజన్మ సుకతమన్నారు. బీసీ బిడ్డనైన తనను అందరూ ఆశీర్వదించి అత్యధిక మెజార్టీతో మెదక్‌ ఎంపీగా గెలిపించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ రాష్ట్ర నాయకులు మైనంపల్లి హనుమంతరావు, కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షులు నిర్మల జయప్రకాశ్‌ రెడ్డి, ఆంజనేయులు గౌడ్‌, కాంగ్రెస్‌ నియోజకవర్గ ఇన్చార్జి ఆవుల రాజిరెడ్డి, ఎంపీపీ జ్యోతి సురేష్‌ నాయక్‌, మెదక్‌ పార్లమెంట్‌ మహిళా ఇన్చార్జి సుజాత, నాయకులు సువాసిని రెడ్డి, కరుణాకర్‌ రెడ్డి, రవీందర్‌ రెడ్డి, శ్రీనివాస్‌ గుప్తా, శ్రీనివాస్‌ గౌడ్‌, నవీన్‌ గుప్తా, మల్లేశం, మణిదీప్‌, అశోక్‌, రిజ్వాన్‌, హంసి బారు వినోద, రామ గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.