– ఎన్నికల హామీ కల నేనా
-ప్రమాదవశాత్తు జారిపడి గాయపడిన వారెందరో
నవతెలంగాణ- రామారెడ్డి
దాదాపు రెండు కిలోమీటర్ల రోడ్డు బీటీ రోడ్ నిర్మాణం లేక, గ్రామస్తులు నరకయాతన అనుభవిస్తున్నారు. చినుకు పడితే చిత్తడై, ద్విచక్ర వాహనదారులు రోడ్డు ప్రమాదంలో గాయపడిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. ఎన్నికలు వచ్చాయంటే ప్రధాన పార్టీలు, మొదటి హామీ రోడ్డు నిర్మాణం పై, ఎన్నికలు ముగిశాయి అంటే రోడ్డు ఉసెతేనే లేదు. అధికారులు ఆ రోడ్డు మ్యాపులో ఊహించడం లేదని చెప్పడం మరో గమనార్ధం. మండలంలోని ఉప్పల్వాయి నుండి కామారెడ్డి వెళ్లే రోడ్డు ఉప్పల్వాయి నుండి మోషన్ పూర్ వరకు బీటీ రోడ్డు కాకపోవడంతో మట్టి రోడ్డుతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, గ్రామస్తులు పోసానిపేట నుండి, రామారెడ్డి నుండి కామారెడ్డి వెళ్లడం మరింత దూరం కావడంతో ప్రజలపై భారం పడుతుంది. రోడ్డు పూర్తి చేస్తే ఉప్పల్వాయి, గిద్ద, రాధాయిపల్లి గ్రామస్తులకు జిల్లా కేంద్రం కామారెడ్డి వెళ్లడానికి ఎంతో అనువుగా ఉంటుంది. మోషన్ పూర్, రంగంపేట గ్రామస్తులు ఉప్పల్వాయి రైల్వే స్టేషన్ చేరుకోవడానికి దూరం తగ్గుతుందని, ఉప్పల్ వాయి లో రైల్వే స్టేషన్ తో పాటు, సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, కళాశాల, షెడ్యూల్ కులాల వసతి గృహం, జిల్లా పరిషత్ పాఠశాల తో పాటు, పశు వైద్యశాల ఉండటంతో రోడ్డు నుండి ప్రతిరోజు చాలామంది రాకపోకలు నిర్వహిస్తున్నారు. సీసీ రోడ్డు నిర్మాణం చేపడుతామని అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు ప్రకటించిన, ఇప్పటివరకు చేపట్టకపోవడం ప్రజలను ఆందోళన గురిచేస్తుంది. ప్రభుత్వం, ప్రజా ప్రతినిధులు వెంటనే స్పందించి రోడ్డు నిర్మాణానికి కృషి చేయాలని ప్రజలు కోరుతున్నారు.
సంకి రతన్ కుమార్, ఎస్ఎఫ్ఐ నాయకులు
గత కొన్ని సంవత్సరాల నుండి, ప్రజా ప్రతినిధులు రోడ్డును, బీటీ రోడ్డుగా మారుస్తామని ఎన్నికల సమయాల్లో హామీలు ఇస్తూ, రోడ్డును బీటీ రోడ్డుగా మార్చకపోవడంతో, గ్రామస్తులకు, చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు ఇబ్బందిగా ఉంది. సీసీ రోడ్డు నిర్మాణం చేపడతామని అధికార పార్టీ నాయకులు ప్రకటించిన, పనులు ప్రారంభం కాకపోవడం ప్రజలకు అసౌకర్యంగా ఉంది. ప్రభుత్వం వెంటనే పనులు ప్రారంభించి, ప్రజల సౌకర్యార్థం రోడ్డు నిర్మాణాన్ని చేపట్టాలని గ్రామ ప్రజల తరఫున కోరుతున్నాను.