చినుకు పడితే చిత్తడే..

If it rains, it will rain..నవతెలంగాణ – శంకరపట్నం
చినుకు పడితే చిత్తడే అన్న చందనంగా ఉంది శంకరపట్నం మండల కేంద్రంలోని కేశవపట్నం బస్టాండ్ పరిస్థితి ఆదివారం కురిసిన చిన్న  వర్షానికె బస్టాండ్ లో నీరు నిలిచి ప్రయాణికులకు తీవ్ర ఇబ్బంది కలుగుతుందని సోమవారం ప్రయాణికులు ఆరోపించారు.ఈ సందర్భంగా ప్రయాణికులు మాట్లాడుతూ..ఇప్పటికైనా ఆర్టీసీ అధికారులు,బస్టాండులో వర్షపు నీరు నిలవకుండా చేసి  ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా చేసి తగిన చర్యలు చేపట్టాలని ప్రయాణికులు కోరారు.