ఉన్నది ఉన్నట్టంటే ఉలుకెందుకు.?

Why are you worried about what is there?– పదేళ్ల బిఆర్ఎస్ పాలనలో నిర్వాసితులను పట్టించుకోలే
– మంత్రి శ్రీధర్ బాబుతోనే నిర్వాసితులకు న్యాయం
నవతెలంగాణ – మల్హర్ రావు
ఉన్నది ఉన్నటంటే బిఆర్ఎస్ పార్టోళ్లకు ఉలుకెందుకని,మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుపై అర్ధరహిత ఆరోపణలు చేయలేదని,వాస్తవ ఆరోపణలే చేశామని కాంగ్రెస్ నాయకులు అన్నారు.శనివారం మండల కేంద్రంలో మాట్లాడారు. గత పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు బిఆర్ఎస్ నాయకులకు నిజంగా నిర్వాసితులపై ప్రేమే ఉంటే తాడిచెర్ల డేంజర్ జోన్లోని నివాస గృహాలను సేకరించి ఇళ్లకు నష్టపరిహారం ఇప్పించి సురక్షిత ప్రాంతాలకు తరలించే వాళ్ళు కదాని.? ప్రశ్నించారు.నిర్వాసితుల కోసం ధర్నాలు చేశామని చేశామని చెబుతున్న మీపై ఎన్ని కేసులు నమోధైయ్యాయో పత్రిక ముఖంగా తెలుపాలని డిమాండ్ చేశారు.స్వార్థ ఆర్థిక ప్రయోజనాలకోసం  అమాయక ప్రజలకు మాయ మాటలు చెప్పి మభ్యపెట్టి మీరు ధర్నా చేపించింది వాస్తవం కాదాన్నారు.బిఆర్ఎస్ నాయకులను పోలీస్ స్టేషన్ లో కూర్చోపెడితే భూ నిర్వాసితుల కమిటీ అధ్యక్షుడు సొంత పూచీకతపై స్టేషన్ నుండి తీసుకువచ్చింది నిజం కాదాని గుర్తు చేశారు.మాజీ ఎమ్మెల్యే పలుమార్లు జెన్కో సిఎండిని కలిసి నిర్వాసితులకు ఎం చేశాడో తెలపాలని, ఐదేళ్లు ఎమ్మెల్యే,మరో ఐదేళ్లు  జెడ్పీ చైర్మన్ గా పదేళ్లు అధికార హోదాలో నిర్వాసితులకు చేసింది శూన్యమన్నారు.మాజీ ఎమ్మెల్యే అండదండలతో బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఒక మాఫియాగా ఏర్పడి కాపురంలో అక్రమంగా ఇండ్లు కంట్టించి వాటికి ప్యాకేజీ రావాలంటే ఒక ఇంటికి రూ.1లక్ష 20 వేలు లంచం తీసుకున్నది వాస్తవం కాదాని..? ప్రశ్నించారు.అక్రమంగా కట్టిన ఇంటికి నెంబర్ కావాలంటే ఒక్కో ఇంటికి రూ.30 వేలు వసూలు చేసింది బిఆర్ఎస్ నాయకులు,కార్యకర్తలు కాదాని.? గుర్తు చేశారు. త్వరలో జరగబోయే సర్పంచ్,ఎంపీటీసీ,జడ్పీటీసీ, వార్డ్ మెంబర్ ఎన్నికల నేపథ్యంలో ఉనికి కోసం అమాయక ప్రజలను నమ్మించడానికి తప్పా అధికారం లేని మాజీ ఎమ్మెల్యే ఎన్నిసార్లు సిఎండిని కలిస్తే ఎం లాభం లేదన్నారు.తమ నాయకుడు ప్రస్తుత  రాష్ట్ర ఐటీ మంత్రి దుద్దిళ్ళ శ్రీదర్ బాబుకు దమ్ముంది కాబట్టే ఆనాడు జెన్కోలో కోల్పోయిన  తాడిచెర్ల-కాపురం భూములకు పరిహారం ఇప్పిమ్చారని,మళ్ళీ తాడిచెర్ల డేంజర్ జోన్ నిర్వాసితులకు తమ నాయకుడు మాత్రమే అది ప్రజా ప్రభుత్వం లో న్యాయం చేస్తారని,ఇది బిఆర్ఎస్ కార్యకర్తలు గుర్తు పెట్టుకోవాలని హుతువు పలికారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కేశారపు చెంద్రయ్య,దన్నపనేని అశోక్ రావు,బిర్నేని దుర్గాప్రసాద్, రావుల ఆంజనేయులు,ఇందారపు ప్రభాకర్,బూడిద రాజా సమ్మయ్య,కొలుగురి రాజేష్,జంగం సుమన్, కొమురయ్య, సమ్మయ్య, చెంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.