– శేరిబాయిగూడెం, కొండపాకగూడెంలో ఆరు నెలల నుంచి సింగిల్ ఫేజ్ విద్యుత్ కష్టాలు
– అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు
– కొండపాకగూడెం సర్పంచ్ మల్లేశ్
నవతెలంగాణ-నార్కట్‌పల్లి
విద్యుత్ రంగంలో దేశానికి తలమానికంగా ఉన్న తెలంగాణ రాష్ట్రం 24 గంటలు నాణ్యమైన విద్యుత్ అందిస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం పదేపదే ప్రకటిస్తున్న తరుణంలో ఇంకా సింగిల్ ఫేస్ విద్యుత్ కనెక్షన్లతో చినుకు పడితే. చీకటి మయంగా మారుతున్న గ్రామాలు సైతం ఉన్నాయి అనడంలో అతిశయోక్తి కాదు. ఉమ్మడి జిల్లా మంత్రి విద్యుత్ శాఖ మంత్రి కావడం . మండలం కేంద్రానికి కూతవేటు దూరంలో ఉన్న కొండపాక గూడెం షేరు బావి గూడెం గ్రామాలలో సాయంత్రం వేళల్లో చిన్న చినుకులు పడ్డ , గాలి దుమారం వచ్చిన. ఆ గ్రామాలు తెల్లారే వరకు అంధకారంలో మగ్గాల్సిందే , అసలే వర్షాకాలం ఆపైన కరెంటు కష్టాలతో. దోమలు స్వైర విహారం చేస్తు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. దోమల దాడితో గ్రామంలో విష జ్వరాలు వచ్చి వేల రూపాయలు ఖర్చు అవుతుంద ని ఆ గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్ అధికారులకు ఎన్నిసార్లు విన్నవించుకున్న పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
చినుకు పడితే.. చీకటే
నంద్యాల అశోక్‌రెడ్డి, షేర్‌బావి గూడెం
.చినుకు పడితే కరెంట్ పోతుంది. సాయంత్రం వేళలో అయితే తెల్లారే వరకు కరెంటు రావడం లేదు. ఈ దుస్థితి గత ఆరు నెలల నుంచి నడుస్తుంది చినుకు పడితే చీకటిమయంలో మగ్గాల్సిన పరిస్థితి నెలకొన్నది. కరెంటు హెల్పర్ పని విధానం సరిగా లేకపోవడంతో గ్రామం చీకట్లో మగ్గుతుంది.
కరెంటు లేక అవస్థలు పడుతున్నాం
జెర్రిపోతుల సత్తయ్య గౌడ్, కొండపాక గూడెం రైతు
గత కొంతకాలంగా వర్షాలకు, గాలి దుమారానికి చెట్ల కొమ్మలు తీగల మీద పడి కరెంటు పోతే రాత్రి మొత్తం చీకట్లో గడపాల్సిన పరిస్థితి ఏర్పడింది. దోమలు కుడుతూ. నిద్ర లేకుండా చేస్తున్నాయి. అధికారులు పట్టించుకోని కరెంటు సమస్యను పరిష్కరించాలి.
అధికారులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదు
కొండపాక గూడెం సర్పంచ్ మల్లేష్
చెరువుగట్టు నుంచి తమ గ్రామానికి సరఫరా అవుతున్న సింగిల్ ఫేస్ కరెంటు కష్టాలు అధికారులకు ఎన్నిసార్లు విన్నవించిన పట్టించుకోవడం లేదు. గత ఆరు మాసాలుగా ఈ సమస్య వేధిస్తుందని పగటి వేళల్లో కరెంటు పోతే నాలుగైదు గంటల తర్వాత సరఫరా ఇస్తున్నారు. సాయంత్రం ఆరేడు గంటల ప్రాంతంలో కరెంటు సమస్య ఏర్పడితే తెల్లారే వరకు పట్టించుకునేవారు లేరని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు వెంటనే స్పందించి సమస్యకు పరిష్కారం చూపాలి లేని పక్షంలో గ్రామస్తులతో కలిసి ఆందోళన చేపడతాం.
విద్యుత్ సమస్యను త్వరలోనే పరిష్కరిస్తాం.
ట్రాన్స్కో సహయక ఇంజనీర్ కే చంద్రశేఖర రావు
షేర్ బావి గూడెం, కొండపాక గూడెం గ్రామంలో అప్పుడప్పుడు వస్తున్న కరెంటు సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు కషి చేస్తున్నాం. త్వరలోనే ఈ సమస్యకు త్వరలోనే పరిష్కరిస్తాం .