
కేజీవిల్ ట్రాక్టర్లను బీటీ రోడ్లపై తిరుగుతే సీల్ చేస్తామని సోమవారం స్థానిక ఎస్సై అనిల్ ట్రాక్టర్ యజమానులకు సూచించారు. పోలీస్ స్టేషన్లో ట్రాక్టర్ యజమానులతో నిర్వహించిన సమావేశంలో అనిల్ మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రజల రవాణా కోసం, కోట్ల రూపాయలు వేచించి రోడ్లను నిర్మిస్తున్నారని, అలాంటి రోడ్లను పాడు చేయకుండా, కేజీ విల్ ట్రాక్టర్ యజమానులు బీటీ రోడ్లు కాపాడేందుకు, కేజీలు ట్రాక్టర్లను తింపవద్దని సూచించారు. కార్యక్రమంలో ట్రాక్టర్ యజమానులు, తదితరులు పాల్గొన్నారు.