‘లైలా..’ సర్‌ప్రైజ్‌ చేస్తే..?

If 'Laila..' surprises..?విశ్వక్‌సేన్‌ నటిస్తున్న యూత్‌ఫుల్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘లైలా’. రామ్‌ నారాయణ్‌ దర్శకత్వంలో షైన్‌ స్క్రీన్స్‌ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మిస్తున్నారు. ఈ మూవీ ఫిబ్రవరి 14న వాలెంటైన్స్‌ డే కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. శుక్రవారం మేకర్స్‌ ‘లైలా ఇచిపాడ్‌’ టీజర్‌ను విడుదల చేశారు.
‘ఈ టీజర్‌ విశ్వక్‌సేన్‌ పాత్ర డ్యుయాలిటీని ఎగ్జైటింగ్‌గా ప్రజెంట్‌ చేస్తోంది. ఇందులో ఆయన సోను మోడల్‌, లైలాగా కనిపించారు. ఇద్దరూ డిఫరెంట్‌ పర్సనాలిటీస్‌గా ప్రేక్షకులను నవ్వించి ఆశ్చర్యపరుస్తారు. సోను మోడల్‌ క్యారెక్టర్‌కు సిటీలో ఒక బ్యూటీ పార్లర్‌ ఉంది. ఆ ప్రాంతంలోని మహిళలతో అతను మాట్లాడటం అక్కడ మగవాళ్ళకి నచ్చదు.
సోను చరిష్మా అతన్ని మరిన్ని ఇబ్బందుల్లోకి నెట్టివేస్తుందనే సమయంలో విధి ఊహించని మలుపు తీసుకుంటుంది. ఇది అతను లైలాగా మారడానికి దారితీస్తుంది.విశ్వక్‌సేన్‌ రెండు పాత్రల అద్భుతంగా పోషించారు. సోను క్యారెక్టర్‌లో ఎనర్జీ అదిరింది. లైలాగా కట్టిపడేశారు. ఒక్కమాటలో చెప్పాలంటే విశ్వక్‌సేన్‌ నట విశ్వరూపాన్ని చూడబోతున్నారు. దర్శకుడు రామ్‌ నారాయణ్‌ ఫ్రెష్‌ స్టొరీ టెల్లింగ్‌ ప్రత్యేకంగా నిలిచింది. రిచర్డ్‌ ప్రసాద్‌ ఛాయాగ్రహణం స్టైలిష్‌ షాట్‌లతో టీజర్‌ విజువల్‌ ఎట్రాక్షన్‌ని పెంచుతుంది. లియోన్‌ జేమ్స్‌ నేపథ్య సంగీతం ఎనర్జీని పెంచుతుంది. షైన్‌ స్క్రీన్స్‌ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మాణ విలువలు గ్రేట్‌ సినిమాటిక్‌ ఎక్స్‌పీరియన్స్‌ని అందిస్తున్నాయి.
స్క్రీన్‌ప్లేను వాసుదేవ మూర్తి రూపొందించగా, బ్రహ్మ కడలి ఆర్ట్‌ డైరెక్టర్‌ పనిచేస్తున్నారు. టీజర్‌ ఎగ్జైట్‌మెంట్‌ని క్రియేట్‌ చేయడంతో పాటు,క్యురియాసిటీని పెంచింది. ఆకాంక్ష  ర్మ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం రొమాన్స్‌, యాక్షన్‌, కామెడీ పర్ఫెక్ట్‌ బ్లెండ్‌గా ఉంటుంది’ అని చిత్ర యూనిట్‌ పేర్కొంది.