నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి పై లేనిపోని ఆరోపణలు చేసి, ఎమ్మెల్యేలు అప్రతిష్ట పాలు చేస్తే ఊరుకునేది లేదని భువనగిరి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు చిక్కుల వెంకటేశం అన్నారు. గురువారం కాంగ్రెస్ పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో విలేకరుల సమావేశం నిర్వహించి, మాట్లాడారు. ఈ నెల 15వ తేదీన జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అండెం సంజీవరెడ్డి భువనగిరి మండలం చందుపట్ల గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు నిర్వహించడంతోనే ఆదినారాయణ ను సస్పెండ్ చేసిన్నట్లు, ఇష్టానుసారంగా మాట్లాడడం సరికాదని హెచ్చరించారు. గత జిల్లా పరిషత్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ నుంచి ఆదినారాయణ కి జడ్పిటిసిగా అవకాశం ఇచ్చి ఆర్థికంగా తోడ్పాటునందించి కాంగ్రెస్ పార్టీలో తగిన గౌరవాన్ని కల్పించిన భువనగిరి శాసనసభ్యులు కుంభ అనిల్ కుమార్ రెడ్డి పై లేనిపోని ఆరోపణలు చేయడం దురదృష్టకరమని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎలిమినేటి కృష్ణారెడ్డి వర్కింగ్ అధ్యక్షులు పాశం శివానంద్ చందుపట్ల పిఎసిఎస్ బ్యాంకు చైర్మన్ మందడి లక్ష్మి నరసింహ రెడ్డి మాజీ మండల పార్టీ అధ్యక్షులు ఎల్లంల జంగయ్య, డిసిసి ప్రధాన కార్యదర్శి నుచ్చు నాగయ్య యాదవ్ ,నానం కృష్ణ, చిన్నం శ్రీనివాస్, ఏడు మేకల మహేష్ , బాలేశ్వర్ లు పాల్గొన్నారు.