– పట్టణ బీఆర్‌ఎస్ పార్టీ నూతన వర్కింగ్ ప్రెసిడెంట్ జుబేర్ లాల
– ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి చేతుల మీదుగా నియామక పత్రాన్ని అందుకున్న జుబేర్ లాల
నవతెలంగాణ-తాండూరు
తాండూరులో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి గెలిపి లక్ష్యం గా పనిచేస్తామని తాండూరు పట్టణ బీఆర్‌ఎస్ నూతన అధ్యక్షులు జుబేర్‌లాల అన్నారు. మంగళవారం బీఆర్ ఎస్ పార్టీ తాండూరు పట్టణ వర్కింగ్ ప్రెసిడెంట్ గా మున్సిపల్ మాజీ కౌన్సిలర్ జుబేర్ లాల ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి చేతిలో మీదుగా నియామక పత్రాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా జుబేర్ లాల మాట్లా డుతూ..బీఆర్‌ఎస్ పార్టీ బలోపేతానికి, ఎన్నికల్లో భారీ విజయం సాధించేలా కషి చేయాలని ఎమ్మెల్యే సూచిం చారు. అదేవిధంగా తనకు పట్టణ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని ఇవ్వడం పట్ల జుబేర్ లాల ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డికి పార్టీ అధిష్టానానికి ప్రత్యేక కతజ్ఞతలు తెలిపారు. తాండూర్‌లో బీఆర్‌ఎస్ పార్టీ గెలుపు కోసం కష్టపడి పని చేస్తామని అన్నారు. ఎమ్మెల్యే రోహిత్ రెడ్డిని తాండూరులో భారీ మెజారిటీతో గెలిపించు కుంటా మని తెలిపారు. బీఆర్‌ఎస్ పార్టీ నాయకులను, కార్య కర్తలను, కౌన్సిలర్లను అందరితో కలిసి పార్టీ బలోపేతా నికి కషి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ పట్టణ అధ్యక్షులు అఫు నహీం బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.