మోడీ వస్తే..ప్రజాస్వామ్యం సమాప్తమే..

– దళిత సమ్మేళనంలో ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ 
– పోన్ ట్యాపింగ్ సృష్టికర్త బండి సంజయ్ ని వాఖ్యలు
– ఎంత కొత్త కారైనా కొన్నెండ్లకు తుప్పుపట్టి షెడ్డుకు పోవాల్సిందేనని స్పష్టం..
నవతెలంగాణ – బెజ్జంకి
కేంద్రంలో మోడీ ప్రభుత్వం మళ్లీ వస్తే..దేశంలో ప్రజాస్వామ్యం సమాప్తమేనని..డాక్టర్ బీఆర్ అంబేడ్కరుడు అందించిన రాజ్యాంగం,ప్రజాస్వామ్యం బతకాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం రావాల్సిన ఆవశ్యకత ఎంతయినా ఉందని కరీంనగర్ డీసీసీ అధ్యక్షుడు, మానకొండూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు.శుక్రవారం మండల కేంద్రంలోని సత్యార్జునా గార్డెన్ యందు ఏర్పాటుచేసిన దళిత అత్మీయ సమ్మేళనానికి ఎమ్మెల్యే కవ్వంపల్లి హజరై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దళిత సామాజిక వర్గాలపై అవలంభిస్తున్న విధానాలపై అక్రోశం వెల్లడించారు.బీజేపీ మళ్లీ అధికారంలోకి వచ్చిన అనంతరం రిజర్వేషన్లను రద్దు చేస్తానని మోడీ ప్రకటిస్తే నఖిలీ విడియో అంటూ అమిత్ షా మాట్లాడుతున్నాడని ఇద్దరిలో దళిత సామాజిక వర్గాల ప్రజలు ఎవరి మాటలు నమ్మాలో తెలియని అనిచ్ఛితి నెలకొందన్నారు.రిజర్వేషన్ల రద్దు అంశం అవాస్తవమని మోడీ స్పష్టత ఇవ్వరేందుకని ప్రశ్నించారు.ప్రభుత్వ రంగాలను ప్రయివేట్ పరం చేసి ప్రభుత్వోద్యోగాలను చెరిపివేశారని..ప్రశ్నిస్తే ఎన్ఐఏ కేసులు పెట్టి జైలులో పెడుతున్నారని అన్నారు.రిజర్వేషన్లు దళిత సామాజిక వర్గాలకు ప్రధానమైన రిజర్వేషన్లను రద్దు చేయాలని బీజేపీ కుట్ర చేస్తోందన్నారు.దళిత బందులో లబ్ధిదారులకు బీఆర్ఎస్ ప్రభుత్వం అందించిన ఎంత కొత్త కారు అయిన కొన్నెండ్లకు ఎనాటికైనా తుప్పుపట్టి షెడ్డుకు పోవాల్సిందేనని స్పష్టం చేశారు.మనమందరం హిందువులమేనని..ఇప్పుడు బీజేపీ కొత్తగా రాముడితో రాజకీయం చేస్తోందని మనము రాముడిని మొక్కుదాం..బీజేపీని పాతళానికి తొక్కుదామన్నారు.దళితులందరూ తమ రిజర్వేషన్లను కాపాడాల్సిన అవశ్యకత అసన్నమైందని..దేవుడి సమానులూ అంబేడ్కరుడని..జైబీమ్ నినాదం ఎత్తుకోవాలని పిలుపునిచ్చారు.ప్రజాస్వామ్యాన్ని బ్రతికించుకోవహడానికి దళిత సామాజిక వర్గాల ప్రజలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావును గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.అనంతరం మండల కేంద్రంలోని పలువురు బీఆర్ఎస్ యువజన నాయకులు జేరిపోతుల మధు అధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరగా ఎమ్మెల్యే కల్లంపల్లి సత్యనారాయణ పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. మండల,అయా గ్రామాల కాంగ్రెస్ నాయకులు,దళిత సామాజిక వర్గాల ప్రజలు హజరయ్యారు.