పోషకాలు చాలకపోతే?

Not enough nutrients?మనం సరిపడా కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు తినకపోతే.. ఆరోగ్యంలో కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. అవేంటో తెలుసుకుంటే తినాల్సిన వాటిని సరిపడా తినవచ్చు. ఈ రోజుల్లో డాక్టర్ల దగ్గరకు వెళ్తున్న పేషెంట్లలో డాక్టర్లు కనిపెడుతున్నదేంటంటే… చాలా మంది కూరగాయలు, ఆకుకూరలు, పండ్ల వంటివి సరిపడా తినట్లేదు. అలా తినకపోవడం వల్ల ఎటువంటి సమస్యలు ఎదురవుతుంటాయో తెలుసుకుందాం…
సరిపడా కూరగాయలు తినకపోతే దంతాల చిగుళ్ల నుంచి రక్తం కారడం మొదలవుతుంది. అందుకు శరీరంలో సరిపడా సి విటమిన్‌ లేకపోవడం వల్లే. కూరగాయలు, పుల్లటి పండ్లు తింటే… సి విటమిన్‌ లభిస్తుంది.
పచ్చటి ఆకుకూరలు, కూరగాయలు సరిపడా తినకపోతే అలసట పెరుగుతుంది. నీరసంగా అవుతారు. ఏ పనీ చెయ్యబుద్ధి కాదు. ఎందుకంటే వాటిలో ఫోలిక్‌ యాసిడ్‌ ఉంటుంది. అది మీకు అలసట, నీరసం వంటివి రాకుండా చేస్తుంది.
శరీరంలో పొటాషియం లోపిస్తుంది. అందువల్ల కండరాల్లో నొప్పి, వాపు, మంట వంటి ఫీలింగ్స్‌ కలుగుతాయి. అలా అయితే ఆలస్యం చెయ్యకుండా వెంటనే కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు తినడం ప్రారంభించండి.
తిన్న ఆహారం జీర్ణం కావాలంటే… శరీరానికి ఫైబర్‌ కావాలి. పెద్దవాళ్లకు రోజుకు 25 గ్రాముల ఫైబర్‌ అవసరమని డాక్టర్లు చెబుతున్నారు. అది కావాలంటే కూరగాయలు, పండ్లు తినాలి. లేదంటే మలబద్దకం సమస్య తలెత్తుతుంది.
సరిపడా కూరగాయలు, ఆకుకూరలు, పండ్ల వంటివి తినకపోతే మెదడు కూడా సరిగా పనిచెయ్యదు. క్రమంగా అది మొద్దుబారిపోతుంది. చివరకు మతిమరపు లాంటి భయంకరమైన సమస్యలకు దారితీస్తుంది.