ఎం.కె.ఎ.కె.ఎ ఫిలిం ప్రొడక్షన్ సమర్పణలో బాబా పి.ఆర్. దర్శకత్వంలో మనోజ్‌కుమార్ అగర్వాల్ నిర్మించిన చిత్రం ‘అష్టదిగ్బంధనం’. సూర్య, విషిక జంటగా నటించిన ఈ చిత్ర థియేట్రికల్ ట్రైలర్ ఈవెంట్ మంగళవారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ‘బేబి’ దర్శకుడు సాయి రాజేష్ ముఖ్య అతిథిగా విచ్చేసి ట్రైలర్‌ను లాంచ్ చేసి, ఈ సినిమా ఈనెల 22న విడుదల కానుందని ప్రకటించారు.
ఈ సందర్భంగా నిర్మాత మనోజ్‌కుమార్ అగర్వాల్ మాట్లాడుతూ, ‘దర్శకుడు బాబా పి.ఆర్ ఈ కథ చెప్పగానే నాకు ఆసక్తికరంగా అనిపించింది. మంచి యాక్షన్, క్రైమ్ థిల్లర్. బాబా కథ చెప్పిన దానికన్నా అద్భుతంగా తీశారు’ అని తెలిపారు. ‘దర్శకుడిగా నా మొదటి సినిమా ‘సైదులు’. ఇది నా రెండో చిత్రం. ప్రేక్షకుణ్ణి ప్రతి సీన్ థ్రిల్‌కు గురి చేస్తుంది. స్క్రీన్‌ప్లే బేస్డ్ సినిమా. ఇందులోని క్యారెక్టర్‌లు సెల్ఫిష్‌నెస్‌తో ఒకరినొకరు అష్టదిగ్బంధనం చేసుకోవాలని చూస్తుంటాయి’ అని దర్శకుడు బాబా పి.ఆర్. అన్నారు.