– స్టాండర్డ్ కాపిటల్ స్టాక్స్ స్ప్లిట్..
హైదరాబాద్: ఫైనాన్స్ రంగం లోని స్టాండర్డ్ కాపిటల్ మార్కెట్స్ తన ఇన్వెస్టర్లకు బోనస్ షేర్లు సహా స్టాక్స్ స్ప్లిట్‌తో బంఫర్ ఆఫర్‌ను ప్రకటించింది. 1:10 రేషియోలో స్టాక్ స్ప్లిట్ ప్రకటించగా.. తాజాగా దానికి బిఎస్‌ఇ ఆమోదం తెలిపింది. అదే విధంగా తమ కంపెనీలో ప్రస్తుతం ఒక్క ఈక్విటీ షేరు ఉంటే 2 బోనస్ షేర్లు ఇవ్వనుంది. దీంతో ఒక్క షేర్‌పై మొత్తం గా 12 షేర్లు దక్కనున్నాయి. దీనికి డిసెంబర్ 29వ తేదిని రికార్డ్ తేది గా నిర్ణ యించింది. షేర్ల విభజనకు నవంబర్ 24న జరిగిన కంపెనీ బోర్డు ఆమోదం తెలిపింది. 1 షేర్‌కు 10 స్టాక్స్ కేటాయించడంతో పాటుగా.. బోనస్ షేర్‌ను ఇవ్వడానికి అంగీకరించింది. స్టాండర్డ్ కాపిటల్ మర్కెట్ లిమిటెడ్ ఫైనాన్సీ యల్ సర్వీసెస్ అగ్రగామిగా ఉందని ఆ సంస్థ యాజమాన్యం తెలిపింది.
ఒక్క షేర్ ఉంటే 10 షేర్లు
12:49 am