సమస్యలు మా దృష్టికి తీసుకు వస్తే పరిష్కరిస్తా

– మున్సిపల్ చైర్మన్ ఆకుల రజిత వెంకన్న
నవతెలంగాణ- హుస్నాబాద్ రూరల్ 
హుస్నాబాద్ పట్టణ ప్రజలు తమ సమస్యలను దృష్టికి తీసుకువస్తే వెంటనే పరిష్కరిస్తామని హుస్నాబాద్ మున్సిపల్ చైర్మన్ ఆకుల రజిత వెంకన్న అన్నారు. శుక్రవారం హుస్నాబాద్ పట్టణంలోని ఐదో వార్డులో డ్రైడే కార్యక్రమం నిర్వహించారు. ఇండ్ల మధ్య నీరు నిల్వ ఉన్న ప్రదేశాలలో ఆయిల్ బాల్స్, స్ప్రే లాంటి కార్యక్రమాలను మున్సిపల్ సిబ్బందితో చేపట్టారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ రజిత మాట్లాడుతూ ప్రజలందరూ తమ చుట్టూ ఉన్న పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉంటామని ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ ఐలేని అనిత రెడ్డి, కమిషనర్  రాజశేఖర్, కౌన్సిలర్ భాగ్య రెడ్డి, ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ రవికుమార్, వార్డ్ ఆఫీసర్ సాదిక్, మెప్మా రిసోర్స్ పర్సన్ వాణిశ్రీ మునిసిపల్ సిబ్బంది పాల్గొన్నారు.