మును “గోడు”లో  మురుగునీరు నిల్వ ఉంటే ఉపేక్షించను..

If sewage is stored in the "wall" before, I will not ignore it..– మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి..
నవతెలంగాణ – మునుగోడు
వర్షాకాలంలో ప్రజలు సీజనల్ వ్యాధుల బారిన పడకుండా  ఉండేందుకు  ముందుగా మరుగు నీటి నిలువ లేకుండా చూడాలని మనుగుడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అధికారులకు ఆదేశించారు సోమవారం  మునుగోడు పట్టణంలోని పలు వీధులలో మురుగునీరు నిల్వ ఉన్న డ్రైనేజీలను పరిశీలించారు .  చుక్క వర్షం వచ్చినా నీరు నిల్వ ఉండకుండా  కిందికి వెళ్లే విధంగా తక్షణమే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. గృహ సముదాయాల మధ్య కాలి ప్లాట్లలో నీటి నిల్వ చేరి పందులకు, దోమలకి  నిలియంగా మారడంతో ఫ్లాట్ యజమానికి వెంటనే నీటి నిలువ లేకుండా చేయాలని అధికారులకు సూచించారు. ఇరుకుగా ఉన్న డ్రైనేజీ లను వెడల్పు చేయాలని, డ్రైనేజీల మీద కట్టడాలను  కూల్చివేసి మురుగునీరు సాఫీగా వెళ్లేలా చూడాలని  స్పెషల్ ఆఫీసర్, జిల్లా పంచాయతీ అధికారిని  ఆదేశించారు. స్థానిక నాయకులతో కలిసి పలు వీధుల్లో తిరుగుతూ డ్రైనేజీలను పరిశీలించి మురుగునీరు నిల్వ ఉండకుండా చూడాలని. ఆ పనులను వెంటనే చేపట్టాలని  అధికారులను అన్నారు. ఈ కార్యక్రమంలో డిసిసిబి చైర్మన్ కుంభం శ్రీనివాస్ రెడ్డి , కాంగ్రెస్ మండల అధ్యక్షుడు భీమనపల్లి సైదులు , ఎంపీడీవో పుష్ప , మాజీ ఎంపీపీ కర్నాటి స్వామి , యువజన కాంగ్రెస్ మాజీ జిల్లా అధ్యక్షులు పాల్వాయి జితేందర్ రెడ్డి, మాజీ ఎంపిటిసి పందుల భాస్కర్ , కాంగ్రెస్ నాయకులు జిట్టగోని సైదులు , కాటం వెంకన్న తదితరులు ఉన్నారు.