అక్రమంగా మట్టి తరలిస్తే చట్టపరంగా కఠిన చర్యలు తప్పవు: తహసీల్దార్

నవతెలంగాణ – శంకరపట్నం
అక్రమంగా జెసిబి లతో మట్టి తరలిస్తే రెవెన్యూ చట్టం ప్రకారం కఠిన చర్యలు తప్పవని జెసిబి యజమానులను శంకరపట్నం మండల తాసిల్దార్ జోగినపల్లి అనుపమ రావు హెచ్చరించారు. గురువారం శంకరపట్నం మండలం కొత్తగట్టు గ్రామపంచాయతీ కార్యాలయంలో మండల ఎంపీడీవో శ్రీవాణి తో కలిసి గ్రామములో విచారణ నిర్వహించారు. ఈ సందర్భంగా తాసిల్దార్ జోగినపల్లి అనుపమ రావు మాట్లాడారు. కొత్తగట్టు గ్రామంలో అక్రమంగా ప్రభుత్వ భూముల నుండి గుట్టల నుండి జెసిబి యజమానులు మట్టి లారీలలో తరలించి లక్షలాది రూపాయలు దండుకుంటున్నారని కొంతమంది. గ్రామస్తులు ఫిర్యాదులు చేయగా అట్టి ఫిర్యాదుల మేరకు, గ్రామంలో క్షేత్రస్థాయి విచారణ చెయ్యగా క్షేత్రస్థాయి విచారణలో పెట్రోల్ బంక్ నిర్మాణానికి గ్రామములోని జెసిబి యజమానులు ఎలాంటి అనుమతులు లేకుండా మట్టిని తరలించినట్లు విచారణలో వెళ్లడైందని, పేర్కొన్నారు జెసిబి యజమానులు సోమవారం తాసిల్దార్ కార్యాలయానికి రావలసిందిగా ఆదేశించినట్లు తెలిపారు. మండల పరిధిలో ప్రభుత్వ అనుమతులు లేకుండా జెసిబి యజమానులు అక్రమంగా మట్టి తరలిస్తే రెవెన్యూ చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకొని జెసిబిని సీట్ చేయడం జరుగుతుందని హెచ్చరించారు. ఈ విచారణలో ఎంపీడీవో శ్రీవాణి గ్రామపంచాయతీ కార్యదర్శి స్వప్న, జెసిబి యజమానులు, గ్రామస్తులు తదితరులు ఉన్నారు.