విద్యార్థులను ఇబ్బంది పెడితే చర్యలు తప్పవు: ఎమ్మెల్యే

– మండల కేంద్రంలో గల కేజీబీవీ పాఠశాల ఆకస్మిక తనిఖీ

– రికార్డులు తనిఖీ చేసిన ఎమ్మెల్యే..
– రెండవసారి సమస్య వస్తే చర్యలు తప్పవు..
– విద్యార్థులకు నాణ్యమైన విద్య, నాణ్యమైన భోజన అందించాలి..
నవతెలంగాణ – నాగిరెడ్డిపేట్
నాగిరెడ్డిపేట మండల కేంద్రంలో గల కేజీవీబీ మరియు ఆదర్శ పాఠశాలలను ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా హాజరు పట్టికలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సోమవారం రోజు పత్రికలలో కేజీవీబీ పాఠశాల విద్యార్థులు భోజనం కోసం తల్లడిదులుతున్నారని వచ్చిన కథనాలు చూసి పాఠశాల తనిఖీ చేయడానికి రావడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. కేజీబీవీ ప్రిన్సిపల్ వీణ ఆడిట్ పై వెళ్లడంతో ఇంచార్జ్ ఉపాధ్యాయురాలు అనురాధను పాఠశాల సమస్యలపై అడిగి తెలుసుకున్నారు. అనంతరం వంట మనుషులతో ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలని ఆదేశించారు. మొదటి తప్పుగా వార్నింగ్ తో సరిపెడుతున్నాను గాని రెండవసారి విద్యార్థులకు భోజనం విషయంలో చదువు విషయంలో ఇబ్బందులు ఉన్నాయని  తమ దృష్టికి వస్తే వెంటనే చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. కేజీబీపీ పాఠశాలకు సరుకులు అందిస్తున్న ఏజెన్సీ నిర్వాహకుడు దీపక్ రెడ్డి తో ఫోన్లో మాట్లాడారు నాణ్యమైన సరుకులను పంపిణీ చేయాలని లేదంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తిరిగి రెండు మూడు రోజులు లోపల పాఠశాలను సందర్శించడానికి మళ్లీ వస్తానని అప్పుడు సమస్యలు రిపీట్ అయితే దక్షణ చర్యలు ఉంటాయని ఆయన అన్నారు. ఆదర్శ పాఠశాలలో మధ్యాహ్న భోజనం సరిగా పెట్టాలని మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని లేకుంటే ఏజెన్సీని తొలగిస్తామని ఆయన హెచ్చరించారు. విద్యార్థుల భోజనం పట్ల చదువు పట్ల ఎవరని క్షమించబోనని నాణ్యమైన విద్య నాణ్యమైన భోజనం అందించాలని ఆదేశించారు.
భోజనం సరిగా పెట్టడం లేదు, ఎమ్మెల్యేతో విద్యార్థులు..
తమకు ఎలాంటి సమస్యలు ఉన్నాయని ఎమ్మెల్యే విద్యార్థులను అడగగా. తమకు ప్రతిరోజు భోజనం సరిగా పెట్టడం లేదని సమయానికి భోజనం అందించడం లేదని టిఫిన్ కూడా టైం కు పెట్టడం లేదని నీళ్ల పప్పుచారు వండుతున్నారని ఎమ్మెల్యే దృష్టికి విద్యార్థులు తీసుకెళ్లడం జరిగింది.. ఇవన్నీ పునరావృత కాకుండా చేస్తానని విద్యార్థులకు ఎమ్మెల్యే చెప్పడం జరిగింది. ఆయన వెంట కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు శ్రీధర్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రామచంద్రారెడ్డి, ఉపాధ్యక్షుడు ఠాగూర్ జనరల్ సెక్రెటరీ దివిటి కిష్టయ్య , కో ఆప్షన్ సభ్యుడు షాయద్ పాషా మైనారిటీ అధ్యక్షుడు ఇమామ్, యూత్ అధ్యక్షుడు శ్రీరామ్ గౌడ్, తోపాటు నాయకులు సురేందర్ గౌడ్, బాల్ డ్డి, కుమార్, అహ్మద్, కలీం, గులాం హుస్సేన్, పర్వతరావు, ఫరూక్ సాబ్, సాయ గౌడ్, శ్రీనివాస్ గౌడ్ తదితరులు ఉన్నారు.