బీసీ ఆకాశం వస్తే మా గ్రామానికి జెడ్పిటిసి టికెట్ ఇవ్వాలి

– ఎమ్మెల్యేను కలిసి సమస్యలు విన్నవించుకున్న నేతలు 
– బ్రాహ్మణ కొత్తపెళ్లి గ్రామ కాంగ్రెస్ నేతలు 
నవతెలంగాణ నెల్లికుదురు 
నెల్లికుదురు మండల జడ్పీటీసీగా బిసి రిజర్వేషన్ వస్తే  బ్రాహ్మణ కొత్తపెళ్లి గ్రామా అభ్యర్థికి అవకాశం ఇవ్వాలని మహబూబాద్ ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళి కోరినట్లు ఆ గ్రామ కాంగ్రెస్ నేతలు మాజీ వైస్ ఎంపీపీ జిల్లా వెంకటేష్ మాజీ సర్పంచ్ పెరుమాళ్ళ మల్లేషo పెరుమాండ్ల శంకర్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీతోనే పేద ప్రజలు అభివృద్ధి చెందుతున్నారని అన్నారు. ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళి సహకారంతో నియోజక వర్గం అన్ని రంగాలుగా అభివృద్ధి జరుగుతుందని అన్నారు. పార్టీ అభివృద్ధికి మండల అభవృద్ధికి కచ్చితంగా మా సహకారం ఉంటుందని తెలిపారు. రాబోయే స్థానిక ఎన్నికల్లో నెల్లికుదురు మండల జడ్పిటిసిగా బీసీ రిజర్వేషన్ అయితే కచ్చితంగా మా బ్రాహ్మణ కొత్తపల్లి గ్రామ అభ్యర్థికి అవకాశం ఇవ్వాలని ఈ సందర్భంగా కోరినట్లు తెలిపారు. మేము గత కొన్ని నెలల నుండి కాంగ్రెస్ పార్టీని పట్టుకొని రాష్ట్ర సుఖాలకు బూడిదడుగులకు ఎదుర్కొన్నామని అన్నారు కావున మా గ్రామాన్ని ప్రత్యేకంగా గుర్తించి మాకు అవకాశాన్ని కోరినట్లు తెలిపారు. పెరుమాళ్ళ రాజు గౌడ్, తాళ్ళ చిన్న ప్రభాకర్ గౌడ్ చిన్న బోయిన శ్రీనివాస్ తొ పాటు కొంత మంది నాయకులు పాల్గొన్నారు.