కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే కష్టాలు తీరుతాయి : బలరాంనాయక్‌

నవతెలంగాణ-నెల్లికుదురు
వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీని గెలిపిస్తేనే పేదల బ్రతుకులు కష్టాలు కడతేరుతాయని కాంగ్రెస్‌ పార్టీ మాజీ కేంద్రమంత్రి పోరిక బలరాంనాయక్‌ అన్నారు. మండలం లోని పార్వతమ్మ గూడెం గ్రామంలో కాంగ్రెస్‌ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు ఏదేళ్ల యాదవ రెడ్డి స్వగహంలో గురువారం విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో ఉన్నప్పు డు పిల్లలకు విద్యాభివృద్ధి కోసం ఎన్నో పాఠశాలలు నిర్మిం చామని వారి విద్యాభివద్ధి కోసం కూడా పేద కుటుంబాలు ఉన్నత స్థాయికిఎదగాలని ఉద్దేశంతో ఫీజు రీయంబర్స్‌ మెం ట్‌ అందించిన ఘనత కాంగ్రెస్‌ పార్టీది అన్నారు. తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ప్రాంత ప్రజలు బాగుపడాలని వా రి బతుకుల్లో వెలుగులు నింపేందుకు సోనియా గాంధీ తె లంగాణ ఇచ్చిందన్నారు. సోనియాగాంధీ ఇస్తేనే వచ్చిన తె లంగాణలో ప్రజలను మోసం చేసి కెేసీఆర్‌ గద్దెనెక్కాడన్నా రు. బీఆర్‌ఎస్‌, బిజెపిలు ప్రజలను మోసం చేయడమే తప్ప వారి అభివృద్ధిని పట్టించుకోవడం లేదన్నారు. తిరిగి కాం గ్రెస్‌ అధికారంలోకి వస్తేనే ప్రజలకు, రైతులకు, విద్యా ర్థులకు అన్నిరంగాలకు వసతులు ఏర్పడి అన్నిరంగాలుగా అభివృద్ధి చెందినందుకు అది కాంగ్రెస్‌ పార్టీతోనే సాధ్యమ న్నారు. మహబూబాబాద్‌ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ పార్టీకి మురళి నాయక్‌ ఎవరో మాకు తెలియదన్నారు. ను నావత్‌ రాధ మహిళా జిల్లా కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులుగా కూ డా కొనసాగుతుందని ఆరోజు నుండి పార్టీకి, అభివద్ధికి కషి చేస్తుందన్నారు. మహబూబాబాద్‌ నియోజకవర్గానికి ఎమ్మె ల్యే శంకర్‌నాయక్‌ చేసిన అభివద్ధి ఏమి లేదన్నారు. ఆరోజు నేను ఎంపీగా ఉన్నప్పుడు తీసుకువచ్చిన అభివృద్ధి పనులు కని పిస్తున్నాయని తెలిపారు.
ఈకార్యక్రమంలో డీసీసీ జిల్లాఉపాధ్యక్షుడు యాదవ, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు నునావత్‌ రాధ, జిల్లా నాయకులు మేకల వీరన్న, తోట వెంకన్న, మండల నాయకులు కొమ్మరి కుంట్ల మౌనేందర్‌, మల్లేష్‌, శ్రీరా మగిరి, మాజీ ఉప సర్పంచ్‌ గంజి గోవర్ధన్‌ నాయకులు గొ ల్లపల్లి ప్రభాకర్‌గౌడ్‌, తదితరులు పాల్గొన్నారు.