నవతెలంగాణ – మోపాల్
మంగళవారం రోజున మోపాల్ మండలంలోనీ గుడి తాండ, మరియుబైరాపూర్ తదితర గ్రామాల్లో జిల్లా కిసాన్ కాంగ్రెస్ ఆధ్యక్షులు ముప్ప గంగారెడ్డి ఆధ్వర్యంలో మోపాల్ మండలంలోని గుడి తండా బైరపుర్ గ్రామ పంచాయతీలో ఎంపీ అభ్యర్థి టీ.జీవన్ రెడ్డి గారి గెలుపు కోసం ప్రచార నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ముప్ప గంగరెడ్డి గారు మాట్లాడుతూ.. కేంద్రంలో ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజా సంక్షేమాన్ని అమలుపరిచే ప్రజాపాలనను తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. నేడు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ప్రజలకు సంక్షేమ పథకాలు అందుతున్నాయి అన్నారు. రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం రావాలంటే ఇందిరమ్మ మనుమడు రాహుల్ గాంధీ ని ప్రధానమంత్రి చేసేందుకు మన గౌరవ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి ని అత్యధిక మెజార్టీతో గెలిపించుకొని రూరల్ ఎంఎల్ఏ భూపతి రెడ్డి అండదండలతో మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుందాం అన్నారు, ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ అనిత ప్రతాప్ సింగ్,ముదక్పల్లీ మాజీ సర్పంచ్ రాధా కిషన్, మాజీ జెడ్పిటిసి మోహన్ కేతవత్,, శ్రీనివాస్ రెడ్డి, వసంతరావు మరియు కాంగ్రెస్ కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు.