పేద ప్రజల అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం: కుంభం

నవతెలంగాణ- వలిగొండ రూరల్

 గ్రామాలలో పేద ప్రజల అభివృద్ధి జరగాలంటే కాంగ్రేస్  పార్టీతోనే సాధ్యం అని భువనగిరి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కుంభం అనిల్ కుమార్  రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన  ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆరూర్, జంగారెడ్డిపల్లె, నరసాయగూడెం, నేమలి కాలువ, వేములకొండ, ఎం తుర్కపెల్లి , ముద్దాపురం గ్రామాలలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. గ్రామాలలోని మహిళలు మంగళ హారతులతో  పూలవర్షం కురిపించి స్వాగతం పలికారు. ఈ సందర్భముగా  ఆయన మాట్లాడుతూ గతంలో కాంగ్రెస్ పార్టీ హయాంలో పేదలకు ఇందిరమ్మ ఇండ్లు, నిరు పేదలకు ప్రభుత్వ భూములు, రైతులకు రుణ మాఫి,ఉచిత విద్యుత్, ఆరోగ్య శ్రీ ఇలాoటి సంక్షేమ పదకాలు ఎన్నో  ఆమలు చేశారని, ప్రస్తుత ప్రభుత్వం అమలుకాని హామీలు కురిపించి 9   సంవత్సరాల కాలంలో ప్రకటించిన  సంక్షేమ పధకలు ఏ ఒక్కటి సక్రమoగా అమలు పర్చడం లేదని, వచ్చే ఎన్నికల్లో కాంగ్రేస్  పార్టీ చేతి గుర్తుకు అత్యధిక ఓట్లు వేసి  మెజార్టీతో తనను గెలిపించాలని కోరారు. అనంతరం గోల్నేపల్లి చెందిన వారు, ఆరూర్ చెందిన  యాదవులు 40 మంది, పహిల్వాన్ పురం కు చెందిన పలువురు వివిధ పార్టీల నుండి కాంగ్రెస్ పార్టీలో అనిల్ కుమార్  సమక్షంలో చేరారు. పార్టీలో చేరిన వారికి ఆయన కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి నుతి రమేష్, జెడ్పిటిసి వాకిటి పద్మా అనంత రెడ్డి, జిల్లా మహిళా అధ్యక్షురాలు నీల పద్మ, తుమ్మల సృజన, తుమ్మల యుగంధర్ రెడ్డి, పసల జ్యోతి, బోళ్ల శ్రీనివాస్, బాథరాజు బాల్ నర్సింహా, పబ్బు ఉపేందర్ బోస్ ,బద్దం సంజీవ రెడ్డి, గరిసె రవి, చిలుగురి సత్తి రెడ్డి, బత్తిని సహదేవ, పిసాటి అంజి రెడ్డి, బుర్ర నర్సింహా, పలుసం సతీష్ , సుక్క ముత్యాలు,కర్ణాకర్ తదితరులు పాల్గొన్నారు.