
రైతులు జాతీయ రహదారి 63 విస్తరణలో భాగంగా భూములు కోల్పోతున్న వారు భూ సేకరణ పై అభ్యంతరాలు ఉంటే తెలుపాలని రెవెన్యూ డివిజనల్ అధికారి రాజా గౌడ్ అన్నారు. పట్టణంలోని మండల ప్రజా పరిషత్ సమావేశ మందిరంలో గురువారం రైతులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. భూ సేకరణ చట్టం ప్రకారం భూ క్రయ విక్రయాల సరాసరి ప్రకారం ధర నిర్ణయం చేస్తామని బేసిక్ విలువ మార్కెట్ విలువ ఎక్కువ తక్కువ తదితర అంశాలను పరిగణలోకి తీసుకొని ధర నిర్ణయం అవుతుందని అన్నారు. రైతులు ఇంతవరకు పరిహారం కోరుకుంటారో తెలియజేయాలని కోరారు. పట్టణం నుండి మంచిర్యాల జాతీయ రహదారి కోసం భూసేకరణలో భాగంగా భూములు కోల్పోతున్న పెర్కిట్, కోటార్మూర్, చేపూర్ గ్రామాల రైతులు పాల్గొన్నారు. . రైతుల అభిప్రాయాలను తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ గజానన్, తదితరులు ఉన్నారు.