– కొంగర రవి
నవతెలంగాణ – దుబ్బాక
ఒక్కసారి మాట ఇస్తే అది పక్కాగా అమలు జరిగి తీరుతుందని.. అదే కాంగ్రెస్ సర్కార్ నైజం అని కాంగ్రెస్ దుబ్బాక మండలాధ్యక్షులు కొంగర రవి తెలిపారు.సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ సర్కార్ సబ్బండ వర్గాల ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తుందన్నారు.దుబ్బాక మండల పరిధిలోని బల్వంతాపూర్ లో మంగళవారం సీఎం రేవంత్ రెడ్డి,మంత్రులు మంత్రులు కొండా సురేఖ,పొన్నం ప్రభాకర్ లతో కూడిన ఫ్లెక్సీకి రైతులు,లబ్ధిదార్లు పాలాభిషేకం చేశారు.ఈ సందర్భంగా కొంగర రవి మాట్లాడుతూ… గత ప్రభుత్వం సాగుకు యోగ్యం లేని భూములకు వేలకోట్ల రైతుబంధును ఇచ్చి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని, 9 ఏళ్లుగా ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదని విమర్శించారు.నేడు కాంగ్రెస్ సర్కార్ చెప్పినట్లే జనవరి 26 నుండి అర్హులైన ప్రతి ఒక్కరికి నూతన రేషన్ కార్డులు,ఇందిరమ్మ ఇండ్లు,జాబ్ కార్డ్ కలిగి ఉండి భూమిలేని పేదలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ద్వారా రూ.6 వేలు అలాగే రైతులకు ఎకరాకు రూ.6 వేల రైతు భరోసాను అందిస్తుందని స్పష్టం చేశారు.బల్వంతాపూర్ ను పైలెట్ ప్రాజెక్టు గ్రామంగా ఎంపిక చేసిన సీఎం రేవంత్ రెడ్డి,మంత్రులు కొండా సురేఖ,పొన్నం ప్రభాకర్,తుమ్మల నాగేశ్వరరావు,ఉత్తం కుమార్ రెడ్డి,కాంగ్రెస్ దుబ్బాక నియోజకవర్గ ఇన్చార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ కార్యకర్తలు, రైతులు,గ్రామస్తులు పాల్గొన్నారు.