హీరోకి శాపం ఉంటే?

హీరోకి
శాపం ఉంటే?యష్‌ పూరి హీరోగా నటించిన కొత్త సినిమా ‘హ్యాపీ ఎండింగ్‌’. ఈ చిత్రంలో అపూర్వ రావ్‌ హీరోయిన్‌గా నటించింది. హమ్స్‌ టెక్‌ ఫిలింస్‌, సిల్లీ మాంక్స్‌ స్టూడియోస్‌ సంయుక్తంగా నిర్మించాయి. యోగేష్‌ కుమార్‌, సంజరు రెడ్డి, అనిల్‌ పల్లాల నిర్మాతలు. కౌశిక్‌ భీమిడి దర్శకుడు. ఈ సినిమా ఫిబ్రవరి 2న గ్రాండ్‌గా థియేటర్స్‌ ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. శనివారం ఈ చిత్ర ట్రైలర్‌ను డైరెక్టర్‌ వేణు ఊడుగుల చేతుల మీదుగా రిలీజ్‌ చేశారు. ఈ సందర్భంగా ప్రొడ్యూసర్‌ అనిల్‌ పల్లాల మాట్లాడుతూ, ‘ఇదొక కమింగ్‌ ఏజ్‌ మూవీ. సౌండ్‌, విజువల్‌, మేకింగ్‌..ఇలా ప్రతి అంశంలో ఈ సినిమా మీకు కొత్తగా అనిపిస్తుంది. ట్రైలర్‌లో మీకు కొంచెం అడల్ట్‌ కంటెంట్‌ కనిపించవచ్చు. కానీ సినిమా చూస్తే అది ఎందుకు ఉందో తెలుస్తుంది. సెక్స్‌ అనే విషయం గురించి ఇప్పటికీ మనదేశంలో ఓపెన్‌గా మాట్లాడుకోలేకపోతున్నాం. కానీ ఓపెన్‌గా మాట్లాడుకునే మైండ్‌ సెట్‌ రావాలి. సినిమా అవుట్‌ఫుట్‌ పట్ల మేము హ్యాపీగా ఉన్నాం’ అని తెలిపారు. ‘హీరోగా నేను చేస్తున్న రెండో సినిమా ఇది. మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌తో కలిసి నిరభ్యంతరంగా మా సినిమా చూడొచ్చు. మాది చిన్న సినిమా కాదు మంచి సినిమా’ అని హీరో యష్‌ పూరి చెప్పారు. డైరెక్టర్‌ కౌశిక్‌ భీమిడి మాట్లాడుతూ, ‘మహాభారతం చదువుతున్నప్పుడు అందులో అనేక శాపాల గురించి ఉంటుంది. అలా ఒక శాపం హీరోకు ఉంటే ఎలా ఉంటుంది అనే కాన్సెప్ట్‌తో మోడ్రన్‌ అప్రోచ్‌తో చేసిన సినిమా ఇది’ అని చెప్పారు. హీరోయిన్‌ అపూర్వ రావ్‌ మాట్లాడుతూ, ‘మనకు సాధారణంగా కనిపించే విషయాలు హీరోని భయపెడుతుంటాయి. అతనో అమ్మాయిని కలుస్తాడు. ఆమే తన ప్రేయసి అవుతుంది. ఈ భయాల మధ్య ఆ అమ్మాయితో తన ప్రేమను ఎలా కొనసాగించాడు అనేది ఈ సినిమా కథ. ఈ సినిమాలో బోల్డ్‌ పర్‌ఫార్మెన్స్‌ చేయలేదు. కథే బోల్డ్‌గా ఉంటుంది’ అని అన్నారు.