నవతెలంగాణ – ఏర్గట్ల
సమగ్ర శిక్ష ఉద్యోగంలో భాగంగా వివిధ కారణాలచే మరణించిన సమగ్ర శిక్ష ఉద్యోగులకు ఏర్గట్ల,మోర్తాడ్ మండలాలకు చెందిన తోటి ఉద్యోగులు నివాళులర్పించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..చనిపోయిన సమగ్ర శిక్ష ఉద్యోగులకు ప్రభుత్వం వెంటనే ఎక్స్ గ్రేషియా ప్రకటించాలని,వారి కుటుంబాలకు ఉద్యోగ భద్రత కల్పించి ఆదుకోవాలని అన్నారు.ప్రస్తుతం పనిచేస్తున్న సమగ్ర శిక్ష ఉద్యోగులకు టైం స్కేల్ ప్రకటిస్తామని చెప్పి ప్రస్తుత ప్రభుత్వం అమలుచేయడం లేదని,మా సమస్యలను పరిష్కరించకుంటే దశలవారీగా నిరసన తెలియజేస్తూ…సమ్మెకు పిలుపునిస్తామని అన్నారు.ఈ కార్యక్రమంలో నవీన్,సాయిరాం,శ్రావణ్, పరిమళ,ప్రేమ,స్వరూప,వినీత, సురేష్,రాము,మధుశేఖర్, గంగాప్రసాద్, పండరీ,మహేంధర్, సునీల్ పాల్గొన్నారు.