సమస్యలు పరిష్కరించకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేస్తాం: ఎస్ఎఫ్ఐ

If the issues are not resolved, we will stage agitations across the state: SFIనవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ 
మార్పు కావాలి కాంగ్రెస్ రావాలి అని చెప్పిన  రేవంత్ రెడ్డి సర్కార్ కు విద్యార్థుల స్కాలర్ షిప్ ఫీజు రీయింబర్స్మెంట్ కనపడటం లేదా ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్ష,  కార్యదర్శులు ఆర్ ఎల్ మూర్తి, తాళ్ల నాగరాజు అన్నారు. ఆదివారం భువనగిరి మండల పరిధిలోని అనంతారం గ్రామ శివారులో గల వెన్నెల కళాశాలలో జిల్లా స్థాయి విద్య, వైజ్ఞానిక శిక్షణ తరగతులను సోమవారం నిర్వహించ ఉండగా ఆదివారం ప్రారంభ సూచికంగా స్వాతంత్రం ప్రజాస్వామ్యం సోషలిజం లక్ష్యాలతో కలిగిన జండాలను ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు చింతల శివ లు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వారు హాజరై,  మాట్లాడారు.  తెలంగాణ రాష్ట్రంలో గత బిఆర్.ఎస్  ప్రభుత్వం హయాంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పేద మధ్యతరగతి విద్యార్థులకు స్కాలర్ షిప్ ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయడం లో త్రీవమైన నిర్లక్ష్యం చేసి  వేలా మంది విద్యార్థుల చావులకు కారణం  అయ్యారనీ, ఇప్పటికి  విడుదల కాకుండా  సుమారు 8వేల కోట్లు ఫీజు రీయింబర్స్మెంట్  బకాయిలు ఉండటం వల్ల ప్రైవేట్ కళాశాలలో చదువు  పూర్తి చేసుకున్న విద్యార్థి నీ, విద్యార్థులు  పై చదువులకు వెళ్ళాలంటే ఫీజులు‌ తప్పనీసరని అంటున్నారన్నారు. పెండింగ్ స్కాలర్ షిప్స్ ఫీజు రీయంబర్స్మెంట్ విడుదలకై ఈ‌నెల జూలై 11,12తేదీలలో  రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కలెక్టర్ లకు పిలుపు నివ్వడం  జరిగిందనీ, ఇప్పటికీ  రేవంత్ రెడ్డి సర్కార్ పేద మధ్యతరగతి విద్యార్థుల తరుపున ఆలోచించి ‌ తక్షణమే స్కాలర్ షిప్ ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రం లో విద్యా వ్యవస్థ కుంటుపడిపోతుందనీ, రాష్ట్రం లో వేంటనే విద్యాశాఖ మంత్రి ని నియమించి, విద్యా వ్యవస్థ ను గాడిన పెట్టాలని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ  సంక్షేమ హాస్టల్లో చదువుకునే విద్యార్థులకు  పాఠశాలలు  ప్రారంభం అయి నెల రోజులు కావస్తున్నా ఇప్పటికీ  హాస్టల్ లకు నోట్ బుక్స్,‌ బట్టలు , దుప్పట్లు  ఇవ్వని పరిస్థితి ఉందనీ,  తక్షణమే  పేద మధ్యతరగతి విద్యార్థుల చదువులు ముందుకు సాగాలంటే  సంక్షేమ హాస్టల్ విద్యార్థుల‌ సమస్యలు   పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో గురుకుల పాఠశాలలో, కళాశాల లో  విద్యార్థుల సమస్యలు రోజు రోజుకు పెరిగి ‌పోతున్నాయనీ, రాత్రి 11గంటలకు సైతం  కలెక్టర్ ‌ముందు ధర్నాలు చేస్తున్నారంటే రాష్ట్రంలో విద్యా వ్యవస్థ ఏ విధంగా  ఉందో అర్థమవుతుందన్నారు. అన్ని సమస్యలు పరిష్కారం కావాలంటే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి  విద్యా వ్యవస్థకు సమగ్ర విచారణ జరిపి ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం చేసేందుకు కృషి చేయాలని కోరారు. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి సర్కారం గత బిఆర్ఎస్ ప్రభుత్వం పార్టీ ఫిరాయింపులపై ఉన్న శ్రద్ధ విద్యారంగ సమస్యలపై లేదని హెచ్చరించారు. రాష్ట్రవ్యాప్తంగా విధాన సమస్యలు పరిష్కారం కాకపోతే ఈ  కాంగ్రెస్ ప్రభుత్వం పైన బలమైన విద్యార్థి ఉద్యమాలు నడపడం జరుగుతుందనీ, ప్రభుత్వంపై సమరశీలక పోరాటాలకు ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపునివ్వడం  జరుగుతుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి లావుడియా రాజు, ఎస్ఎఫ్ఐ మాజీ రాష్ట్ర అధ్యక్షులు కల్లూరి మల్లేశం ఎస్ఎఫ్ఐ మాజీ రాష్ట్ర ఉపాధ్యక్షులు వనం రాజు, రైతు సంఘం జిల్లా కార్యదర్శి మాటూరి బాలరాజు, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ సభ్యురాలు శివాని ఉపాధ్యక్షులు వేముల నాగరాజు, కాసుల నరేష్, ఈర్ల రాహుల్, జిల్లా కమిటీ సభ్యులు ఉదయ్, జగన్, పవన్, కార్తీక్ వంశీ లు పాల్గొన్నారు.