
కోమటిరెడ్డి బ్రదర్స్ పై కొందరు బీఆర్ఎస్ నాయకులు వారి రాజకీయ ప్రస్థానం తెలియకుండా అవాకులు చావాకులు చేస్తున్నారని వారిని సహించేది చేయలేదని కాంగ్రెస్ మున్సిపల్ పట్టణ అధ్యక్షులు అనంత చంద్రశేఖర్ గౌడ్, మండల అధ్యక్షులు కోరిమి ఓంకారంలు హెచ్చరించారు. మున్సిపల్ పట్టణంలో విలేకరులతో మాట్లాడారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాతోనే నియోజకవర్గానికి రూ.570 కోట్లు వచ్చాయని మరవద్దన్నారు. టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల పనుల్లో కొంత ఆటంకం ఏర్పడిందని త్వరలోనే అన్ని గాడిన పడతాయి అన్నారు. భువనగిరి ఎంపీగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఉన్నప్పుడు భువనగిరి, నియోజకవర్గాలకు ఎన్నో అభివృద్ధి పనులు చేశారన్నారు. కొందరు ఆయన వల్ల లబ్ధి పొందినప్పటికీ హామీలు మర్చిపోవడం సిగ్గుచేటు అన్నారు. మండలంలో అభివృద్ధి పనులు ఆగిపోయాయి అని చెప్పడం, కోమటిరెడ్డి బ్రదర్స్ పట్టించుకోవడంలేదని కొందరు గీట్టని వాళ్లు అపోహాలు చేస్తున్నారని, వారి మాటలు ప్రజలు నమ్మవద్దు అన్నారు. మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి రోడ్ విస్తరణ పనులు చేపట్టమని చెప్పారని గుర్తు చేశారు. ఏ ప్పుడు కూడా పనులు ఆపవద్దని చెప్పలేదన్నారు. ఎలక్షన్ తర్వాత మునుగోడు నియోజకవర్గం అంత అభివృద్ధి పనులో పరుగులు పెడుతుంది అన్నారు.రోల్ మోడల్గా మారుస్తానని ఇప్పటికే ఎమ్మెల్యే హామీ ఇచ్చారని తెలిపారు. 2018 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచి కరోనా టైం కష్టకాలంలో మునుగోడు నియోజకవర్గం అంతా నిత్యవసర సరుకుల పేరుతో ఎంతోమంది పెద ప్రజలను ఆదుకున్నారన్నారు. తనని అడిగితే ఎంతో కొంత సాయం చేసే గుణం ఉన్న వ్యక్తి అని అన్నారు. వారిపై దుష్ప్రచారాలు చేస్తే ప్రజలు తగిన బుద్ధి చెప్పక తప్పదు అన్నారు. ఈ కార్యక్రమంలో కావలి ఆంజనేయులు, దోటి చంద్రశేఖర్ యాదవ్, కోడి శ్రీనివాసులు, ఎంపీటీసీ పల్లే వెంకన్న, కోడి గిరి బాబు సాపిడి రాములు, గండూరి జనార్ధన్, కలిమికుండా జనార్ధన్, భూతరాజు వేణు ,నల్లగంటి మల్లేష్, భూతరాజు ఆంజనేయులు, బొమ్మర గోని సైదులు, ఈరిగి వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు.