స్థానికేతర ముత్తిరెడ్డిని గెలిపిస్తే భూకబ్జాలు అవినీతి చేశాడు

– వడ్లకు మద్దతు ధరపై రూ.500 బోనస్‌
– జనగామ కాంగ్రేస్‌ పార్టీ అభ్యర్థి కొమ్మూరి
నవతెలంగాణ -కొమురవెల్ల్లి
రెండుసార్లు స్థానికేతరుడైన ముత్తిరెడ్డిని గెలిపిస్తే నియోజకవర్గంలో భూకబ్జా అవినీతికి పాల్పడి కోట్లు కొల్లగొట్టాడని జనగామ కాంగ్రెస్‌పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్‌ రెడ్డి అన్నారు. సోమ వారం మల్లన్న ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం మండలం కేంద్రంతో పాటు రసులాబాద్‌, రాంసాగర్‌, గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండుసార్లు స్థానికేతరుడు గెలిచి నియోజకవర్గాన్ని పూర్తిగా దోచుకున్నారని, బీఆర్‌ఎస్‌పార్టీ మరోసారి స్థానికేతరునికే అవకాశం ఇచ్చారన్నారు. కాంగ్రెస్‌ పార్టీ ఆరు గ్యారెంటీలను అమలు చేస్తుంద న్నారు. కాంగ్రెస్‌పార్టీ చెయ్యి గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మద్దూరు జడ్పీటీసీ కొండల్‌ రెడ్డి , మాజీ జడ్పీటీసీ నర్సింగరావు, మాజీ ఎంపీపీ పర మేశ్వర్‌, ఆగంరెడ్డి, మహాదేవుని శ్రీనివాస్‌, కొయ్యడ శ్రీనివాస్‌, లింగంపల్లి శ్రీనివాస్‌, లింగంపల్లి కనకరాజు తురాయి నవీన్‌, వల్లాద్రి అంజిరెడ్డి, జంగని రవి, శిక నర్సింలు, ప్రసాద్‌ , గంగుల అయిలయ్య, శ్రీకాంత్‌ గౌడ్‌ పాల్గొన్నారు.