
పెండింగ్ వేతనాలు ఇవ్వాలని, ఇన్సూరెన్స్ అమలు చేయాలని లేనియెడల విధులు బహిష్కరిస్తామని సీఐటీయూ అనుబంధ సంఘం గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రెసిడెంట్ పైల గణపతి రెడ్డి అన్నారు. గురువారం వారు కలెక్టరేట్ కార్యాలయంలో డిపిఓ సునంద కి వినతిపత్రం అందజేసి మాట్లాడారు. పెండింగ్ వేతనాలు వెంటనే అమలు చేయాలని అదేవిధంగా ఇన్సూరెన్స్ కూడా ఎండిఓ లకు ఎంపీ ఓ పంచాయతీ సెక్రెటరీ సర్కులర్ ఇవ్వాలని కోరారు. అనంతరం సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి మాయ కృష్ణ మాట్లాడుతూ.. ప్రభుత్వము వెంటనే స్పందించి పెండింగ్ వేతనాలు ఇవ్వాలని ఇచ్చిన హామీలను అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జీవో 51 సవరించాలని, మల్టీపర్పస్ వర్కర్ విధానాన్ని రద్దు చేసి, ప్రభుత్వం ప్రకటించిన పది లక్షల ఇన్సూరెన్స్ పథకాన్ని తక్షణమే అమలు చేయాలిని, పోస్ట్ ఆఫీస్ బీమా పథకం ద్వారా డబ్బులు చెల్లించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మహిళా కన్వీనర్ పొట్ట యాదమ్మ, జిల్లా అధ్యక్షులు బందెల భిక్షం, జిల్లా ప్రధాన కార్యదర్శి గడ్డం ఈశ్వరయ్య, రెడ్డబోయిన ఐలయ్య, శంకర్, మాండ్ర శీను, పాపయ్య హనుమంతు, సువర్ణ, పెంటమ్మ, నరసమ్మ లు పాల్గొన్నారు.