
నవతెలంగాణ – పెద్దకొడప్ గల్
పెద్ద కొడపగల్ మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో శనివారం నాడు మండల సర్వ సభ్య సమావేశం ఎంపీపీ ప్రతాప్ రెడ్డి అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి జుక్కల్ శాసన సభ్యులు తోట లక్ష్మికాంత్ రావు అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయ శాఖల వారిగా సమీక్ష సమావేశం నిర్వహించారు.మండలంలోని పలు పాఠశాల ఉపాధ్యాయులు సమయ పాలన పాటించడం లేదని సభ దృష్టికి తీసుకువచ్చారు. అదే విదంగా కొన్ని గ్రామాల పాఠశాలలోని ఉపాధ్యాయులు మద్యం సేవించి విధులు నిర్వహిస్తున్నారని ఎమ్మెల్యే దృష్టికి వచ్చినట్లు మండల విద్యా శాఖ అధికారిని నిలదీయాడం జరిగింది. వీటి పై మండల విద్య శాఖ అధికారి దేవిసింగ్ ను ఎమ్మెల్యే వివరణ కోరగా సరైన సమాధానం చెప్పకుండా తాడబడడంతో దీన్ని బట్టి మండల ఉపాధ్యాయుల తీరు .మీరు పని చేసే విధానం ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు అని ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యవసాయ శాఖలో భాగంగా నిర్మించిన రైతు వేదికలో రైతులకు అవగాహన సమావేశలు ఏర్పాటు చేశార అని ప్రశ్నించాగా వ్యవసాయ శాఖ అధికారి నదీమ్ ఉద్దేన్ గ్రామాల వారిగా రైతులకు సమావేశాలు ఏర్పాటు చేసి అవగాహన కల్పిస్తున్నామని చెప్పగా రైతు వేదికలు నిర్మించింది రైతుల సమావేశం కొరక్కని కచ్చితంగా రైతు వేదికలోనే సమావేశం ఏర్పాటు చేసి రైతులకు అవగాహన కల్పించాలని ఆదేశించారు.పలు శాఖల అధికారుల పని తీరు సరిగ్గా లేదని పలువురు ఎమ్మెల్యే దృష్ఠికి తీసుకురాగా వివరణ కోరి వారి పనితీరుపై అసహన వ్యక్తం చేశారు. ఇక నుండి అదికారులు పని తీరును మార్చుకోకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ప్రతాప్ రెడ్డి,ఎంపీడీఓ రాణి,తహసీల్దార్ దశరథ్,ఎంపిఓ సూర్యకాంత్, జడ్పిటిసి చంద్రబాగా, సొసైటీ చైర్మన్ హన్మంత్ రెడ్డి,కో అఫ్సన్ మెంబర్ జాఫర్ షా,ఆయా శాఖల అధికారులు ,సర్పంచులు, ఎంపిటిసి పాల్గొన్నారు.