రాహుల్ విజరు, శివాని రాజశేఖర్ లీడ్ రోల్స్‌లో తేజ మార్ని తెరకెక్కించిన చిత్రం ‘కోట బొమ్మాళి పీఎస్’. శ్రీకాంత్, వరలక్ష్మీ శరత్ కుమార్ కీలకపాత్రలు పోషించారు. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్‌పై బన్నీ వాస్, విద్యా కొప్పినీడి నిర్మించారు. ఈనెల 24న సినిమా విడుదలవుతున్న సందర్భంగా హీరో శ్రీకాంత్ మీడియాతో సంభాషించారు.
‘ఇదొక డిఫరెంట్ కాన్సెప్ట్. ఎక్కడైనా పోలీసులు క్రిమినల్స్‌ని ఛేజ్ చేసి పట్టుకుంటారు. కానీ ఇందులో పోలీస్ ఛేజెస్ పోలీస్ కథ. పొలిటిషన్స్ పోలీసులను ఎలా వాడుకుంటారు? దానివల్ల పోలీసులకు ఎదురైన ఇబ్బందులు ఏమిటి అనేది మెయిన్ కాన్సెప్ట్. ఓటు బ్యాంకింగ్ కోసం కులాలను, మతాలను రాజకీయ నాయకులు ఏ విధంగా వాడుకుంటారు అనేది ఇందులో స్పష్టంగా చూపించారు. సిస్టమ్‌లో జరిగేది మాత్రమే చూపించారు. కానీ పొలిటికల్‌గా ఎలాంటి సెటైర్ ఉండదు. దర్శకుడు తేజ కథ చెబుతున్నప్పుడే థ్రిల్ అయ్యాను. శ్రీకాకుళం బ్యాక్‌డ్రాప్‌లో ఉంటుంది. స్టోరీ, స్క్రీన్ ప్లే చాలా ఎక్సైటింగ్‌గా ఉంటుంది. హెడ్ కానిస్టేబుల్ రామకష్ణ పాత్రలో నటించాను. నేను, రాహుల్ విజరు, శివాని రాజశేఖర్.. మా ముగ్గురి పాత్రల మధ్య కథ తిరుగుతుంటుంది. వరలక్ష్మి శరత్ కుమార్ మా పై ఆఫీసర్‌గా ఉండి.. మమ్మల్ని పట్టుకోవడానికి చూస్తారు. వరలక్ష్మి వేసే ఎత్తులకు నేను పైఎత్తులు వేస్తూ ఉంటాను. పర్ఫార్మెన్స్‌కి చాలా స్కోప్ ఉన్న పాత్ర పోషించాను. ‘లింగిడి లింగిడి’ సాంగ్ రిలీజ్ అయిన తర్వాత సినిమాపై బజ్ బాగా పెరిగింది. ప్రొడ్యూసర్స్ బన్నీ వాసు, విద్య చాలా క్లారిటీగా దీన్ని రూపొందించారు’ అని అన్నారు.