అంగన్వాడీ కార్యకర్తల సమస్యలు పరిష్కరించకపోతే పోరాటాలను ఉధృతం చేస్తాం

– రాజ్యాంగబద్ధంగా చేస్తున్న సమ్మెకు విఘాతం కలిగిస్తూ తాళాలు పగలగొట్టడం హేయమైన చర్య

నవతెలంగాణ- కంటేశ్వర్ 
అంగన్వాడీ కార్యకర్తల సమస్యలు పరిష్కరించకపోతే పోరాటాలను వదులుదాం చేస్తామని రాజ్యాంగబద్ధంగా చేస్తున్న సమ్మెను వివాదం కలిగిస్తూ తాళాలు పగలగొట్టడం ఏమైన చర్య అని అంగన్వాడి జిల్లా కార్యదర్శి స్వర్ణ డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం  ఐసిడిఎస్ రూరల్ కార్యాలయం ముందు అంగన్వాడి టీచర్లు ఆయా మాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ సందర్భంగా అంగన్వాడీ యూనియన్ జిల్లా కార్యదర్శి స్వర్ణ అన్నారు. ఈ సందర్భంగా అంగన్వాడి జిల్లా కార్యదర్శి స్వర్ణ  మాట్లాడుతూ.. ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాతో వ్యక్తిని చాకిరి చేయిస్తూ సరైన ప్రతిఫలం అందించకుండా 65 సంవత్సరాలు పనిచేయాలని చెప్పడం సిగ్గుచేటని అన్నారు వీటితోపాటు రిటర్న్ రిటర్మెంట్ బెనిఫిట్స్ కనీసం 10 లక్షల వరకు అయినా అందించాలని అదేవిధంగా రిటర్మెంట్ అయిన తర్వాత సగం జీతం అందించే విధంగా ఉద్యోగ భద్రత కల్పిస్తూ ప్రభుత్వం అంగన్వాడీ కార్యకర్తల హక్కులను కాపాడే విధంగా ఈ డిమాండ్లను పరిష్కరించాలని శాంతియుతంగా సమ్మె చేస్తున్న బాపట్ల ఇటువంటి దాస్టికానికి దిగజారడం సిగ్గుచేటని అన్నారు. రాజ్యాంగం కార్మికులకి కల్పించిన హక్కు సమ్మె అని ఇటువంటి సమ్మె ని బంగ పరచడం కోసం టిఆర్ఎస్ ప్రభుత్వం కుట్రలు పన్నుతూ అంగన్వాడి సెంటర్ల తాళాలు పగలగొట్టి హక్కులను కాలరాస్తున్నారు న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనకు జీవితామని హెచ్చరించారు రాబోయే ఎన్నికలలో అంగన్వాడీల సెగ తగలక మానదని హెచ్చరించారు.
అధికారుల వేదింపులు మానుకోవాలి
సమ్మె లో పెట్టిన కనీస వేతనం,పర్మినెంట్,రిటైర్మెంట్ బెనిఫిట్స్,ప్రమాద భీమా సౌకర్యం తదితర అంశాలపై మంత్రి  ఇచ్చిన హామీలను తుంగ లో తొక్కడం కాక,ఆ హామీల అమలుకై సమ్మె లోకి వెళ్తే,సమ్మె కంటే రెండు రోజుల ముందునుండే సమ్మె విచ్ఛిన్నం చేయడానికి బి ఆర్ ఎస్ అనేక కుట్రలను పన్నిందని అన్నారు.గ్రామపంచాయతీ కార్యదర్శులను,ఆశా వర్కర్లు ను,మధ్యాహ్న భోజనం కార్మికులను, ఐకెపి వివో ఏ  లను అంగన్వాడీ చేసే విధులను తాత్కాలికంగా అప్పగించడానికి బాధ్యతలను అప్పగించిందన్నారు.ఈకార్యక్రమంలో అంగన్వాడీల పోరాటానికి మద్దతుగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి బొడ.అనిల్, ఐద్వా అధ్యక్ష కార్యదర్శులు అనిత,సుజాత, సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు రాములు, కృష్ణ, నర్సన్న అంగన్వాడీలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.