కార్మికుల సమస్యల పరిష్కరించకపోతే పోరాటాన్ని ఉధృతం చేస్తాం

– సీఐటీయూ జిల్లా కార్యదర్శి గోపాలస్వామి
నవతెలంగాణ -హుస్నాబాద్ రూరల్
గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలు తక్షణమే పరిష్కరించాలని లేకపోతే సమ్మెను తీవ్రతరం చేస్తామని సీఐటీయూ జిల్లా కార్యదర్శి కాములు గోపాల స్వామి డిమాండ్ చేశారు శనివారం హుస్నాబాద్ మండల పరిషత్ కార్యాలయం ఎదుట 3వ రోజు కొనసాగిన సమ్మెలో పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రామపంచాయతీ కార్మికులను పర్మినెంట్ చేస్తానన్న హమిని తుంగలో తొక్కిందన్నారు . గ్రామపంచాతీ కార్మికుల నష్టం చేసే విధంగా జీవో నెంబర్ 51 తీసుకోవచ్చు మల్టీ పర్పస్ విధానాన్ని అమలు చేస్తుందన్నారు. కారోబార్, స్వీపర్ లు అన్ని రకాల పనులు చేయడం అంటే నైపుణ్యం మీద ఆధారపడి ఉండాల్సి ఉంటుందన్నారు. వెంటనే మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలని అర్హత కలిగిన కరోబర్లను జూనియర్ పంచాయతీ సెక్రటరీగా ప్రమోషన్ అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. కనీస వేతనం 26 వేల రూపాయలు ఇవ్వాలని, పీఎఫ్ ఈఎస్ఐ సౌకర్యాలు కల్పించాలని అన్నారు. గ్రామపంచాయతీ కార్మికుడు చనిపోతే ఎక్స్ గ్రేస్ కింద పది లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి చొప్పరి రవికుమార్, హుస్నాబాద్ మండల గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ జేఏసీ చైర్మన్ దుర్గయ్య నాయకులు సదానందం, మైబెల్లి, సంపత్, గ్రామపంచాయతీ కార్మికులు పాల్గొన్నారు.