రిజర్వేషన్లు అనుకూలిస్తే సర్పంచు ఎన్నికల్లో పోటీ చేస్తాం..

If the reservations are favorable, we will contest in Sarpanchu elections.నవతెలంగాణ – జన్నారం
రిజర్వేషన్లు అనుకూలిస్తే స్థానిక సర్పంచ్ ఎన్నికల్లో మండలంలోని 29 గ్రామపంచాయతీలో గల్ఫ్ కార్మికుల సంక్షేమ సమితి సభ్యులు పోటీ చేస్తారని గల్ఫ్ కార్మికుల సంక్షేమ సమితి మండల అధ్యక్షుడు పాలాజీ శ్రీనివాస్, జనరల్ సెక్రటరీ దుమల్ల ఎల్లయ్య అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండలంలో తెలంగాణ గల్ఫ్ కార్మికుల సంక్షేమ సమితి కమిటీలు 15 పైగా ఉన్నాయని, కమిటీల ద్వారా పలు గ్రామాలలో సామాజిక సేవలు మరియు గ్రామ అభివృద్ధిలో పాలుపంచుకుంటున్నామని అన్నారు. గల్ఫ్ కార్మికులు గ్రామాల్లో పెద్ద సామాజిక వర్గాన్ని కలిగి ఉండడంతో రిజర్వేషన్లు అనుకూలిస్తే సర్పంచ్ బరిలో ఉంటారని, ఒకవేళ రిజర్వేషన్లు అనుకూలంగా లేకపోతే సామాజిక సేవ, గ్రామాభివృద్ధి, ప్రజలకు సేవ చేసే గుణాలు ఉన్న వ్యక్తులకు గల్ఫ్ కార్మికుల సంక్షేమ సమితి మద్దతు తెలిపి వారి గెలుపులో కీలక పాత్ర పోషిస్తామని అన్నారు.