నైపుణ్యాన్ని గుర్తించి ప్రోత్సహిస్తే రాణిస్తారు 

– క్రీడాకారులకు జెర్సీల అందజేతలో కర్రావుల శంకర్ 
నవతెలంగాణ – బెజ్జంకి 
క్రీడాకారుల్లోని నైపుణ్యాన్ని గుర్తించి ప్రోత్సాహిస్తే వారంతటవారే రాణిస్తారని కాంగ్రెస్ పార్టీ మండల ఉపాధ్యక్షుడు కర్రావుల శంకర్ అన్నారు. అదివారం మండల పరిధిలోని పెరకబండ గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద  కర్రావుల శంకర్ తన స్వంత ఖర్చులతో జెర్సీలను స్థానిక క్రికెట్ క్రీడాకారులకు అందజేశారు. క్రీడాకారులకు తనవంతు సహాయ సహకారాలు ఎళ్లవేళల అందజేస్తానని, ఉత్తమ ప్రతిభ కనబరిచి పేరుప్రఖ్యాతలు తీసుకురావాలని క్రీడాకారులకు శంకర్ సూచించారు. జెర్సీలను అందజేసిన శంకర్ కు క్రీడాకారులు, పలువురు గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు.