మూలం తెలియకపోతే మందు ఎలా వేస్తారు?

If the source is not known, how can the drug be administered?నష్టదాయకంగా పరిణమించిన దేన్నైనా అంతమొందించాలంటే దానిని మూలాల నుండి సమూలంగా తొలగించాలి. కుల, మత లేదా మరో రకపు అస్తిత్వ రహిత సమాజం కావాలంటే అది ఏ మోతాదులో నష్టం చేకూరుస్తుందో తెలి యాలి. కుల, మత ప్రాతిపదికన నిర్మితమైన సమాజాలేవీ చరిత్రలో ఎల్లకాలం నిలవలేక పోయాయి. అదే సందర్భంలో కుల, మత అంత రాలతో పరిపాలన సాగిన చోట సమానత్వానికి అవకాశమే లభించలేదు. త్రేతాయుగపు శంభూ కుడి నుంచి కలియుగపు రోహిత్‌ వేముల వరకు మనుషులు మధ్య వివక్షకు కారణమైంది కుల మేగా! భారతదేశం అసమానతలకు నెలవు. దాని కి ఆనవాళ్లు కులాల సమూహాల్లో స్పష్టంగా కన్పి స్తుంది. కానీ సమాజంలో ఆర్థికంగా ఎదిగిన కొందరు, వెనుకబడిన వారితో సహా, చాలా మందికి ఈ విషయంపై ఇక అభిప్రాయం లేదు. అందుకే జనాభా లెక్కల్లో కులగణనపై ఇంత రాద్దాంతం జరుగుతోంది. సంకుచిత రాజకీయ ప్రయోజనాలు ఈ అంశంపై పార్టీల ఊగిస లాటకు ప్రాణం పోస్తున్నాయి. నైపుణ్యాన్ని బట్టి కాకుండా మనిషి పుట్టిన కులాన్ని బట్టి వృత్తిని నిర్ణయించి, జీవితాంతం నిర్భంధించే కుల విష కౌగిలిని విడిపించే ప్రయత్నాలేవీ వీరంతా చేయడం లేదు.
బీహార్‌ రాష్ట్ర ప్రభుత్వం కులగణన గణాంకా లను వెలువరించిన వారం రోజులలోపే రాజస్థాన్‌ లోని కాంగ్రెస్‌ ప్రభుత్వం కూడా కులగణన చేపట్ట నున్నట్లు అధికారికంగా ప్రకటించడంతో దేశ రాజ కీయాలలో ఇది మరింత ప్రాధాన్యతను సంతరిం చుకోనున్నది. కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ కూడా దీని పై స్పష్టమైన వైఖరి తీసుకున్నది. కుల గణనను వ్యతిరేకిస్తున్న రాజకీయ సమూహాలకు ఇది ఒక సవాలుగా పరిణమించింది. ఇండియా కూటమిగా ఏర్పడిన ప్రతిపక్ష పార్టీల సమూహం ఇదే అంశాన్ని ప్రధాన ఎజెండాగా చేసుకోవడంతో కేంద్రంలోని అధికార కూటమికి ఏం చేయాలో పాలుపోని పరిస్థితి ఏర్పడింది. బీహార్‌ రాష్ట్ర జనాభా లెక్కల గణాంకాలపై విశ్లేషకులు వివిధ నిర్ధారణలు చేస్తుంటే వాటిపై ప్రతిస్పందించేందుకు మిత వాదులు తికమకపడుతున్నారు. కులగణనకు వ్యతిరేకం కాదు కానీ దాన్ని రాజకీయం చేయొ ద్దంటూ ఒక ముక్తాయింపుతో సరిపెట్టాలని చూస్తున్నారు.
రాష్ట్ర ప్రభుత్వాలు తమకు తామే జనాభా లెక్కలకు పురమాయించుకోవడం కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిదర్శనం. 2021లో చేపట్టాల్సిన జనాభా లెక్కలను కరోనా మహమ్మారి తగ్గి పోయిన తర్వాత కూడా చేపట్టడానికి కేంద్రం సిద్ధంగా లేకపోవడం వల్ల రాష్ట్ర ప్రభుత్వాలు తమకు తాము ఈ చర్యలకు దిగాల్సి వస్తున్నట్లుగా స్పష్టం అవుతుంది. బీహార్‌ రాష్ట్రం ఈ కార్యక్ర మానికి సిద్ధపడినప్పుడు దానిని నిలువరించేం దుకు ఏకంగా సుప్రీం కోర్టుకెక్కి కేంద్రం ప్రయత్నిం చింది. ”జనాభా లెక్కల సేకరణ కేంద్రం పరిధిలో నిదే ఐనప్పటికీ, ఒక రాష్ట్ర ప్రభుత్వం తమ రాష్ట్ర ప్రజల వివరాలు సేకరించవద్దని చెప్పే నిర్భందపు చట్టం లేదని” సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అనుకున్నట్లే సదరు వివరాలన్నీ సేకరించిన తరు వాత వాటి వివరాల ప్రకటనకు బీహార్‌ సిద్ధ పడు తున్న వేళ కేంద్రం మరోసారి సుప్రీంకోర్టు తలుపు తట్టి చేసిన ఆపే ప్రయత్నం సఫలం కాలేదు. దీంతో అక్టోబర్‌ రెండున బీహార్‌ గణాంకాలు బహిర్గతమయ్యాయి.
బీహార్‌ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన జనాభా లెక్కల్లో కులాల వారీగా ప్రచురితమైన వివరాలు దిగ్భ్రాంతి గొల్పకపోయినా, స్వాతంత్య్రం సాధిం చిన నాటి నుండి ఇప్పటివరకు జరిగిన ప్రయ త్నాలు సామాజిక అసమానతలను ఏమాత్రం తొలగించలేకపోయాయి. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నది అనే వాస్తవాలు బయటపడ్డాయి. బీహార్‌ రాష్ట్రం చేపట్టిన ఈ లెక్కలలో కొన్ని ముస్లిం కులాలను అటు ఓసీల్లో ఇటు ఓబీసీల్లో కలపడంతో కొంత వాస్తవికతకు ఇబ్బంది కలిగినా షెడ్యూల్డ్‌ కులాలు 15శాతం కన్న ఎక్కువేనని, వెనుకబడిన తరగతులు 50శాతం కన్నా ఎక్కువే అన్న వాస్తవ కోణం బయటపడింది. వెనుకబడిన తరగతులు 27శాతం ఉంటే, ఎక్స్‌ట్రీమ్‌ బ్యాక్వర్డ్‌ క్లాసెస్‌ (అత్యంత వెనుకబడిన తరగతే) 36 శాతం ఉన్నట్లు నిర్ధారణ కావడం చేపట్టవలసిన బాధ్యతకు సవాలు విసురుతోంది. ఇలా వివరాలు బయటపడటంతో అన్ని వైపులనుండీ డిమాండ్లు పెరుగుతాయనీ, వాటిని ఎదుర్కొనే క్రమంలో రాజకీయ సమీకరణలు మారుతాయని, మతమనే అస్తిత్వవాదమే ఆయుధంగా వున్న పార్టీకి గుబులు పుట్టుకొస్తుంది.
రాజకీయ సమీకరణల కోసం దేశమంతా కులం ఒక ప్రధాన ఆయుధంగా మారింది. కులం, ప్రాంతీయతత్వం, మితిమీరిన భాషాభిమానం పేరుకుపోయిన చోట మతతత్వ సమీకరణలకు అవకాశాలు పెరగడం లేదు. కులగణనకు పెరుగు తున్న ఆదరణ ద్వారా ఏం సాధించవచ్చునో తెలియటం లేదు కానీ రాజకీయ ఆశవాహులకు ఇదొక ఆయుధంగా పరిణమించనున్నది. కేవలం రాజకీయాల్లో లేదా వాటి ఆధారిత పదవులలో కుల సమీకరణలను బట్టి అధికారాలను ఇచ్చినంత మాత్రాన ఇన్నాళ్లు వివక్షకు గురైన జనానికి ఏమీ ఉపయోగం ఉండదు. నిచ్చెన మెట్ల కుల వ్యవస్థ విద్యకు ఉపాధికి అసంఖ్యాకులను దూరం చేసింది. జనాభాలో ఫలానా కులానికున్న నిష్పత్తిని బట్టి సీట్లను కేటాయించమనే డిమాండ్లు తక్షణమే వస్తాయి. కుల ఆధారిత వివరాలు వెనుకబాటు తనాన్ని పారదోలేందుకు ఉపయోగపడాలి గానీ కేవలం రాజకీయ పదవుల పంపకాలకు కాదు. రాజకీయాల్లో ప్రాతినిధ్యం వహించడం కూడా ఒక ప్రధాన భాగమే.
సదరు వివరాలను ప్రకటించిన బీహార్‌ పాలక పార్టీలకు గానీ లేదా ఈ ప్రక్రియను బల పరుస్తున్న ఇతర బూర్జువా పార్టీలకు గానీ కులాల ఆధారంగా పేదరికంలో కూరుకుపోయిన వారికి బయటికి లాగాలన్న దృఢ సంకల్పం ఉందని భావించలేము. ప్రత్యర్థిని ఇరకాటంలో పెట్టడాని కైనా ఈ వివరాల సేకరణ ద్వారా తీసుకోవలసిన జాగ్రత్తలు గోచరమౌతాయి. బీహార్‌ గణాంకాలు వెలువడగానే ఏయే పదవుల్లో ఎవరెవరి శాతం ఎంతుందో కొందరు లెక్కలేసి అక్కసుగా మాట్లా డుతున్నారు. వీరు నిందించాల్సింది లబ్ది పొందిన సదరు కులాలని కాదు. అటువంటి పరిస్థితికి అవకాశమిచ్చిన అనాది కులవ్యవస్థని, దాన్ని సరి దిద్దే ప్రయత్నం చేయని ఆధునిక రాజకీయ, పరిపాలనా విభాగాలను.
”కుల రహిత సమాజం కోరుకునే వాళ్ళు కులాల లెక్కలు అడగటం అర్థరహితం” అని వాదించే మితవాదులంతా ”కులాల గణాంకాలు వొద్దు కానీ కులాలు మాత్రం ఉండాలి” అని వాధి స్తారు. ఇంకా ఒక అడుగు ముందుకేసి, ”కులాలు కలిగిన సమాజం సామాజిక సమస్యలకు సమాధానం ఇవ్వగలదని” వాధి స్తారు. అదెలా గంటే.., ఆస్థి పంపకాల్లో, నేరారోపణల్లో, ఇతర తగాదాల్లో నిచ్చెన మెట్ల కుల వ్యవస్థలోని పై వారి మాట కింది వారు జవదాటరాదట! స్త్రీలు కూడా పురుషులకు, నిచ్చెనమెట్ల కులవ్యవస్థలోని పై వారికి బద్దులై వుండాలట! ఇక్కడ న్యాయాన్యా యాలు, విచక్షణలు, నిష్పక్షపాతం వంటివి కాకుండా పుట్టిన కులాన్ని బట్టి అధికారం హక్క వడం అర్థరహితంగా లేదూ! కానీ ఇప్పుడధి కారంలో ఉన్న సమూహం ఈ తరహా మనువాద పరిపాలనకు ఇష్టపడుతుంది. అందుకే సమాజం లోని ఈ బలహీనతని ఆసరా చేసుకుని కాలం వెళ్లదీయాలనుకుంటుంది.
”కులగణన చేపట్టడం అంటే మరిన్ని రిజర్వే షన్లు కల్పించడానికి” అనే భావన, భయం అనే కుల్లో ఏర్పడుతుంది. వాస్తవానికి రిజర్వేషన్ల ద్వారా లభించే ఉద్యోగాల సంఖ్య పూర్తిగా తగ్గి పోతుంది. ఇప్పుడంతా ”పీస్‌ రేట్‌ సిస్టమ్‌ అండ్‌ ఫేవరిటిసం” దీనిని నూతన సమాజమూ అంగీకరిస్తున్నది. అయితే సామాజిక రుగ్మతల కారణంగా నిర్లక్ష్యానికి గురైన కొందరికైనా చేయూతనివ్వకపోతే అది రాక్షస సమాజమౌతుంది. గణాంకాల ద్వారా అం తరాలను తెలియజేస్తే తిరుగుబాటు వస్తుందన్న భయంతోనే కులగణనకు అయిష్టంగా ఉన్నారు. అయితే ప్రజాగ్రహానికి గురి కాకూ డదని ఈ గణన చేపట్టే అవకా శమూ వుంది. అది కంటి తుడుపు చర్యలా కాకుండా సమగ్రంగా ఉంటేనే నిర్దిష్ట నిర్దారణలకు అవకాశముంటుంది.
– జి. తిరుపతయ్య, 9951300016