
– నకిలీ పెట్రోల్ ఏది..క్వాలిటీ పెట్రోల్ ఏది..
– వాహనదారులకు మైలేజీ ఇవ్వని పెట్రోల్
– తెలంగాణ ప్రభుత్వం పెట్రోల్ అమ్మకాలపై నిఘా పెట్టాలి
– మోసాలను అరికట్టాలి
నవతెలంగాణ – మద్నూర్
భారతదేశంలో తెలంగాణ, మహారాష్ట్ర రాష్ట్రాలు వేరే ఇరు రాష్ట్రాల్లో పెట్రోలు అమ్మకాల్లో కూడా రంగులు వేరే, అమ్మకాల ధరల్లో కూడా తేడాలే. తెలంగాణ రాష్ట్రంలోని మద్నూర్ మండలం మహారాష్ట్ర ప్రాంతానికి పూర్తిగా సరిహద్దులో బార్డర్లో ఉండటం, మద్నూర్ మండలం మహారాష్ట్రలోని దెగ్లూరు పట్టణం పూర్తిగా కలిసి ఉన్నట్లే ఉన్నాయి. మీరు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాలు పెట్రోల్ బంకులతో సరిహద్దులు దాటాయి. వాహనదారులు పెట్రోల్ బంకుల్లో పెట్రోలు వాహనాలు వేసుకుంటే పెట్రోల్ రంగులు తేడాగా ఉన్నాయి. మైలేజీ ఇవ్వడంలో కూడా తేడాలు వస్తున్నట్లు వాన దారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మన రాష్ట్రంలో పెట్రోల్ ధర లీటర్ కు మహారాష్ట్ర కంటే మూడు నుండి నాలుగు రూపాయలు తేడా ఉంది. మన రాష్ట్రంలో అధికంగా ఉంటే మహారాష్ట్ర రాష్ట్రంలో పెట్రోల్ ధర లీటర్కు నాలుగు రూపాయలు తక్కువగా ఉన్నట్లు వాహనదారులు తెలుపుతున్నారు.
రాష్ట్రాలు వేరంటే పెట్రోల్ రంగుల్లో తేడాగా కనిపించడం, మైలేజీ తక్కువగా ఇవ్వడం, తెలంగాణ ప్రాంత మహానదారులు నకిలీ పెట్రోల్ ఏది, క్వాలిటీ పెట్రోల్ ఏది అనే దానిపై సందిగ్ధంలో ఉన్నారు. మహారాష్ట్ర పెట్రోల్ ఎరుపు రంగులో ఉండగా, తెలంగాణ పెట్రోల్ పసుపు రంగులో కనిపిస్తోంది. అసలు ఏది క్వాలిటీ అనే దానిపై వాహనదారులు ఆలోచన లో పడ్డారు. ఇలాంటి పెట్రోలు అమ్మకాలపై పెట్రోల్ కు సంబంధించిన క్వాలిటీ అధికారులు పెట్రోల్ బంకుల్లో తనిఖీలు చేసి, పెట్రోల్ క్వాలిటీ గా అమ్ముతున్నారా లేక కల్తీ చేసి అమ్ముతున్నారా పకడ్బందీగా నిఘా పెట్టవలసిన అవసరం ఎంతైనా ఉందని మండలంలోని వాహనదారులు సంబంధిత శాఖ అధికారులను కోరుతున్నారు. రాష్ట్రాలు వేరంటే పెట్రోల్ రంగు కూడా తేడాలు ఉండటం ఏమిటని ప్రజల్లో ఆవేదన వ్యక్తం అవుతుంది. కల్తీ పెట్రోల్ అమ్మకాలు జరుగుతున్నట్లు వాహనదారులు ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. పెట్రోల్ బంకుల్లో అమ్మకాలు ఎలా జరిగినా, ఏళ్ల తరబడి తనిఖీలు చేపట్టిన దాఖలాలు ఎక్కడా కనిపించడం లేదు. ఇప్పటికైనా తెలంగాణ పెట్రోల్ మహారాష్ట్ర పెట్రోల్ రంగులో తేడా కనిపిస్తున్నందున అసలు క్వాలిటీ పెట్రోల్ ఏది అనేదానిపై అధికారులు ప్రజలకు తెలియజేయవలసిన అవసరం ఎంతైనా ఉందని, నకిలీ పెట్రోల్ తో మోసపోకుండా చర్యలు చేపట్టాలని అధికారులను వాహనదారులు కోరుతున్నారు.