తాను చదువు చెప్పిన విద్యార్థి ప్రయోజకుడైతే ఆ గురువు శ్రమకు ఫలితం దక్కుతుంది

నవతెలంగాణ – కంటేశ్వర్
తాను చదువు చెప్పిన విద్యార్థి ప్రయోజకుడు అయితే ఆ గురువు శ్రమకు ఫలితం దక్కుతుంది. విద్యార్థులను ఉన్నతులుగా తీర్చిదిద్దినప్పుడే ఉపాధ్యాయులకు సమా జంలో ఎంతో గౌరవం ఉంటుంది. కేవలం పుస్తకాల్లో ఉన్న పాఠాలను బోధించి.. పనైపోయిందనుకోకుండా వారికి ప్రయోగాత్మకంగా విద్యను అందించి జిల్లా, రాష్ట్ర, జాతీయస్థాయిలో రాణించేలా కృషిచేస్తున్నారు.. ఆయనే దుబ్బ ఉన్నత పాఠశాల భౌతికశాస్త్రం ఉపాధ్యాయుడు ముద్దుకృష్ణ. తన16 ఏళ్ల విధి నిర్వహణలో సాధించిన విజ యాలపై ప్రత్యేక కథనం..ముద్దుకృష్ణ మొదటిసారిగా ప్రభుత్వ ఉన్నత పాఠశాల భీమ్ గల్ లో 2009లో ఉపాధ్యాయుడిగా చేరారు. ప్రస్తుతం జిల్లా కేంద్రంలోని దుబ్బ పాఠశాలలో భౌతిక శాస్త్రంలో స్కూల్ అసిస్టెంట్ గా విధులు నిర్వర్తిస్తున్నారు. సమాజంలో మార్పులకనుగుణంగా కొత్త విషయాలను కనుక్కోవాలనే తపన ఎప్పుడు ఆయనలో మెదలుతూ ఉంటుంది.  తన ఆశయాలను ఇన్నోవేషన్ గా ఆలోచించే విద్యార్థులకు బోధించి విజేతలుగా నిలిచేలా ప్రోత్సహిస్తున్నారు. జిల్లా, రాష్ట్ర, సౌత్ఇండియా, జాతీయస్థాయి ప్రదర్శనలు ఏవైనా సత్తా చాటుతూ ముందుకు సాగుతారు. ఉపాధ్యాయుడు ముద్దుకృష్ణ ప్రోత్సాహంతో చాలా మంది విద్యార్థులు వివిధ స్థాయిల్లో రాణిస్తున్నారు.ప్రదర్శనల్లో పాల్గొని తమ సత్తా చాటారు. 2012 నుంచి సాగిన ప్రస్థానం:  విజ్ఞాన ప్రదర్శనలో ‘సేవ్ హోం’ అనే అంశంలో సంజీవ్, ప్రశాంత్ అనే విద్యార్థులు రాష్ట్రస్థాయికి ఎంపిక. 2015లో ప్రేరణ ప్రదర్శనలో ‘ఏ హెల్పింగ్ హ్యాండ్ టు డిసెబులిటిస్.. ఫార్మర్స్’ అనే అంశంలో విద్యార్థులు నవీన్, రాజు రాష్ట్రస్థాయికి ఎంపిక జవహర్లాల్ నెహ్రూ గణిత, విజ్ఞానశాస్త్ర పర్యావరణ ప్రదర్శన(జేఎన్ ఎంఎస్ఈ)లో నితిన్, ప్రకాశ్ విద్యార్థులతో దక్షిణ భారత దేశానికి ఎంపిక. 2018లో ప్రేరణ పురస్కారాల్లో  షేక్ సోఫియా ప్రదర్శన ‘ఎనర్జీ సేవింగ్ ఫ్రమ్ ఆప్టికల్ ఫైబర్ కేబుల్’ ప్రాజెక్టుకు రాష్ట్రస్థాయిలో మొదటి బహు మతి అందుకొంది. 2019 ఏడాది ప్రదర్శనల్లో విద్యా ర్థులు నివేదిక, సౌమ్య ప్రాజెక్టు మ్యాజిక్ విత్ మ్యాథ్స్ రాష్ట్రస్థాయికి ఎంపికయ్యారు. 2019లో ఇన్నోవేటివ్ టీచర్స్ అవార్డు సంస్థ వారి ఆధ్వర్యంలో ‘ఇన్నోవేటివ్ టీచర్’గా పురస్కారం నగదు బహుమతి అందుకున్నారు. ఈ అవార్డును పద్మశ్రీ చింతికింది మల్లేశం  చేతుల మీదుగా అందుకున్నారు.2019 అక్టోబర్ లో శ్రీహరి కోట(షార్) ఆధ్వర్యంలో నిర్వహించిన వరల్డ్ స్పేస్ వీక్లో ‘మూన్ ద గేట్ వే ఆఫ్ స్టార్స్’ ప్రదర్శనలో నిఖిల్, వినయ్, ప్రభు, వరుణను శాస్త్రవేత్త రఘురాం అభినందించి బహుమతిని అందించారు.2018 లో  జవహర్ లాల్ నెహ్రూ నేషనల్ సైన్స్ అండ్ మ్యాథ్స్ ఎగ్జిబిషన్ లో దక్షిణ భారత దేశ స్థాయిలో టీచర్ ఎక్సిబిట్ కేటగిరీ లో మొదటి బహుమతి అవార్డ్ మరియు నగదు బహుమతి అందుకున్నారు. ఈ అవార్డ్ అందుకోవటం తో దక్షిణ భారత దేశ స్థాయిలో ఉత్తమ సైన్స్ ఉపాధ్యాయుడు అయ్యారు.2019 ఏడాది ప్రదర్శనల్లో విద్యా ర్థులు నివేదిక, సౌమ్య ప్రాజెక్టు మ్యాజిక్ విత్ మ్యాథ్స్ రాష్ట్రస్థాయికి ఎంపికయ్యారు.2019లో ఇన్నోవేటివ్ టీచర్స్ అవార్డు సంస్థ వారి ఆధ్వర్యంలో ‘ఇన్నోవేటివ్ టీచర్’గా పురస్కారం నగదు బహుమతి అందుకున్నారు. ఈ అవార్డును పద్మశ్రీ చింతికింది మల్లేశం చేతుల మీదుగా అందుకున్నారు.2019 అక్టోబర్ లో శ్రీహరి కోట(షార్) ఆధ్వర్యంలో నిర్వహించిన వరల్డ్ స్పేస్ వీక్లో ‘మూన్ ద గేట్ వే ఆఫ్ స్టార్స్’ ప్రదర్శనలో నిఖిల్, వినయ్, ప్రభు, వరుణను శాస్త్రవేత్త రఘురాం అభినందించి బహుమతిని అందించారు.2018 లో  జవహర్ లాల్ నెహ్రూ నేషనల్ సైన్స్ అండ్ మ్యాథ్స్ ఎగ్జిబిషన్ లో దక్షిణ భారత దేశ స్థాయిలో టీచర్ ఎక్సిబిట్ కేటగిరీ లో మొదటి బహుమతి అవార్డ్ మరియు నగదు బహుమతి అందుకున్నారు. ఈ అవార్డ్ అందుకోవటం తో దక్షిణ భారత దేశ స్థాయిలో ఉత్తమ సైన్స్ ఉపాధ్యాయుడు అయ్యారు. 2020 లో భారత కేంద్ర ప్రభుత్వం విజ్ఞాన భారతి వారి ఆధ్వర్యంలో లో నిర్వహించే నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ సైంటిస్ట్ పోటీలో సిల్వర్ మెడల్ గెలుపొందారు. ఆ కౌన్సిల్ లో శాశ్వత సభ్యుని గా ఎన్నికయ్యారు.2020 లో భారత కేంద్ర ప్రభుత్వం విజ్ఞాన భారతి వారి ఆధ్వర్యంలో లో నిర్వహించే నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ సైంటిస్ట్ పోటీలో సిల్వర్ మెడల్ గెలుపొందారు. ఆ కౌన్సిల్ లో శాశ్వత సభ్యుని గా ఎన్నికయ్యారు.2021 లో జరిగిన రాష్ట్రీయ బాల విగ్యాన్ ప్రదర్శన్ లో తన పర్యవేక్షణ లో రెండు ప్రాజెక్టులో రాష్ట్ర స్థాయికి ఎన్నిక కావడం విశేషం. విద్యార్థి పూజ తయారు చేసిన కూల్ అంబ్రెళ్ళ ఇన్ హాట్ సమ్మర్ , ఇఫ్రా ఫాతిమా తయారు చేసిన త్రియాంగిల్ వాష్ రూం ప్రాజెక్ట్ లకు గైడ్ టీచర్ గా వ్యవహరించారు.2021 లో టెక్ మహీంద్రా ఫౌండేషన్ వారు అండ్ సైన్స్ అకాడెమీ హైదరాబాద్ వారు నిర్వహించే ట్రాన్స్ఫర్మింగ్ ఎడ్యుకేటర్ అవార్డ్ గెలుపొందారు. తెలంగాణ రాష్ట్ర స్థాయిలో బహుమతి అందుకున్నారు.ఇటీవల 2024 జనవరి నెలలో హర్యానా ఫరీదబాద్ లో జరిగిన ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ లో మన జిల్లా తరపున పాల్గొన్న ఏకైక ఉపాధ్యాయుడు. ఆస్పిరింగ్ ఇండియా – నేషనల్ సైన్స్ టీచర్ వర్క్స్ షాప్ లో పాల్గొన్నారు.ప్రస్తుతం తాను 2024 ఫిబ్రవరి నెల  చివరి వారంలో గుజరాత్ లోని ఐఐఐటీ గాంధీనగర్ లో నిర్వహించే సెంటర్ ఫర్ క్రియేటివ్ లెర్నింగ్ వర్క్ షాప్ లో పాల్గొనబోతున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఉపాధ్యాయులకు విద్యార్థుల లో సృజనాత్మకత జోడించి నూతన బోధన పద్ధతులు వివరిస్తారు. గుజరాత్‌లోని ఐఐటీ-గాంధీనగర్‌లో ఫిబ్రవరి 28 నుంచి మార్చి నెల 3 వరకు జరగనున్న సెంటర్ ఫర్ క్రియేటివ్ లెర్నింగ్ నేషనల్ లెవల్ ఫిజికల్ సైన్స్ టీచర్ ట్రైనింగ్ క్యాంపుకు నిజామాబాద్ జిల్లా దుబ్బ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న ఫిజికల్ సైన్స్ టీచర్ సిహెచ్.ముద్దుకృష్ణ ఎంపికయ్యారు. సెంటర్ ఫర్ క్రియేటివ్ లెర్నింగ్ (CCL), ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, గాంధీ నగర్, గుజరాత్ రాష్ట్రంతో తెలంగాణ రాష్ట్రంలోని విద్యార్థులు మరియు ఉపాధ్యాయులకు అభ్యాస అనుభవాన్ని పెంపొందించడానికి, 100 మంది ఫిజికల్ సైన్స్ ఉపాధ్యాయులను మాస్టర్ ట్రైనర్‌లుగా గుర్తించిన సామర్థ్య నిర్మాణ వర్క్‌షాప్‌లతో అవగాహన కల్పించారు.  ఈ వర్క్‌షాప్‌ల ప్రాథమిక లక్ష్యం రిసోర్స్ గ్రూప్ టీచర్లు మరియు మాస్టర్ ట్రైనర్ల సామర్థ్యాలను పెంపొందించడమేనని, వారి సంబంధిత జిల్లాల్లో అప్లికేషన్-ఓరియెంటెడ్ మరియు కాంటెక్స్ట్-డ్రైవెన్ లెర్నింగ్‌ను సులభతరం చేయడానికి వీలు కల్పించడం జరుగును.  జాతీయ స్థాయి శిక్షణా కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్రం నుంచి 100 మంది ఫిజికల్ సైన్స్ ఉపాధ్యాయులు ఎంపికైనట్లు ఎస్ సిఇ ఆర్ టి డైరెక్టర్ ఆధ్వర్యంలో తెలిపారు.ఈ విధంగా తాను విద్యార్థులకు  తన వృత్తి ధర్మం లో భాగంగా మంచి మెరుగైన విద్యా అందిస్తూ వారిని భావితరాలకు వారసత్వంగా మంచి పౌరులుగా తీర్చి దిద్ది అందించలనేది తన లక్ష్యం గా భావిస్తున్నారు. విజ్ఞాన తెలంగాణ వైపు మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలంటే విజ్ఞాన పౌరులు అవరసరం అని అన్నారు.