విద్యార్థి దశలోనే సైన్స్ పై పట్టు పెంచుకుంటే ఉజ్వల భవిష్యత్తు ఉంటుంది

– రాకెట్లు, గ్రహంతర ఉపగ్రహాల యొక్క నమూనాల ప్రదర్శన ప్రారంభించిన రాజేందర్ రెడ్డి
నవతెలంగాణ – కంఠేశ్వర్ 
విద్యార్థి దశలోనే సైన్స్ పై పట్టు పెంచుకుంటే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని ఉమెన్స్ ఎడ్యుకేషనల్ సొసైటీ రాజేందర్ రెడ్డి అన్నారు ఈ మేరకు గురువారం అబ్దుల్ కలాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ యూత్ ఎక్సెలెన్స్ (కె.ఐ.వై.ఇ), డి.ఆర్.డి.ఓ, యన్.ఆర్.ఐ, ఇస్రో  ఆధ్వర్యంలో రాకెట్లు, గ్రహంతర ఉపగ్రహాల యొక్క నమూనాల ప్రదర్శన ఉమెన్స్ కాలేజ్ గ్రౌండ్స్, కంఠేశ్వర్ గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఉమెన్స్ ఎడ్యుకేషనల్ సొసైటీ రాజేందర్ రెడ్డి హాజరైన రాకెట్లు, గ్రహంతర ఉపగ్రహాల యొక్క నమూనాల ప్రదర్శన  చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ప్రతి విద్యార్థి శాస్త్రవేత్తలుగా ఎదిగి దేశ సేవలో ముందుండాలని సూచించారు. పాఠశాల స్థాయి నుండే విద్యార్థిని విద్యార్థులు అన్ని రంగాలలో రాణించాలని అప్పుడే అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటారని ఈ సందర్భంగా తెలియజేశారు.ఉమెన్స్ కళాశాల విద్యార్థినిలు కౌంటర్లలో ఉండి వాటి విశిష్టత గురించి సంక్షిప్తంగా ఆయా పాఠశాలల నుండి సందర్శనకు విచ్చేసిన విద్యార్థిని విద్యార్థులకు వివరించారు. ఈ ప్రదర్శనలో సుమారు 17 ప్రదర్శనలు అనగా మాంగల్యాన్, చంద్రయాన్, జీ సాట్ 31, ఓసియాన్సట్, ఇన్సాట్ 3d, ఐ ఆర్ ఎన్ ఎస్ ఎస్, ఆర్యభట్ట, ఏ ఎస్ ఎల్ వి, ఎస్ ఎల్ వి 3, జిఎస్ఎల్వి, క్రయో సి 25 స్టేజ్, జి ఎస్ ఎల్ వి ఎంకే థర్డ్, ఏ ఎస్ ఆర్ ఏ, క్యూఆర్ ఎస్ ఏ ఎం, ఎన్ఏజి, ఆకాష్ మీ సెల్, చంద్రయాన్ వన్, వంటి ప్రదర్శనలను ప్రదర్శించగా ప్రదర్శనలు ప్రతి ఒక్కరిని ఆకర్షింప చేశాయి.విద్యార్థులు ఏర్పాటు చేసిన ప్రదర్శనలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. ప్రధానంగా చంద్రయాన్, రాకెట్లు, ఆర్యభట్ట స్కేల్, జీఎస్ఎల్వీ రాకెట్లు తదితర ప్రదర్శనలు విద్యార్థులను ఆలోచింపజేశాయి.ఈ కార్యక్రమంలో డిఆర్డిఓ, డిఆర్డిఎల్, ఇస్రో, ఎన్.ఆర్.ఎస్. సి అధికారులు, ఉమెన్స్ కళాశాల ప్రిన్సిపల్ భారత్ రెడ్డి, ఉమెన్స్ కళాశాల కమిటీ సభ్యులు కిషన్ రెడ్డి, అబ్బన్న, పద్మనాభ రెడ్డి, మహేందర్ రెడ్డి, రవి పబ్లిక్ స్కూల్ చైర్మన్ సరళ మహేందర్ రెడ్డి, రవి స్కూల్ కరస్పాండెంట్ శ్యామ్, ట్రస్మా అధ్యక్షులు నిత్యానందం, అరుణ్, మోహన్, ధర్మరాజు, శ్రీనివాస్, ఇండియన్, సి.ఇ.ఓ నరేష్, , ఈ గొప్ప సదవకాశాన్ని విద్యార్థిని, విద్యార్థులు వినియోగించుకోవడం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉంటాయని ప్రతి ఒక్కరు ఉపయోగించుకోవాలని కోరారు. గొప్ప శాస్త్రవేత్తలుగా ఎదగాలి అలాగే ఇలాంటివి ఇలాంటి మంచి ప్రదర్శన మంచి ప్రదర్శన జీవితంలో చాలా మేధాశక్తితో  ఉంటారు. ఇలాంటి ప్రదర్శనను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవడం సంతోషకరం అని వారు తెలిపారు.