మాట తప్పితే పోరాటం తప్పదు: సీఐటీయూ

– న్యాయబద్దంగా రిటైర్ మెంట్ బెనిఫిట్స్ అమలు చేయాలి
– సీఐటీయూ జిల్లా కార్యదర్శి నూర్జహాన్
నవతెలంగాణ – కంఠేశ్వర్
మాట తప్పితే పోరాటం తప్పదని న్యాయబద్ధంగా రిటైర్మెంట్ బెనిఫిట్స్ అమలు చేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి నూర్జహాన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం నగరంలోని ధర్నా చౌక్ వద్ద అంగన్వాడీ టీచర్లు హెల్పర్లకు ప్రభుత్వం ఇచ్చిన మాట తప్పినందుని పోరాట బాట పట్టాల్సి వచ్చిందని సీఐటీయూ జిల్లా జిల్లా కార్యదర్శి నూర్జహాన్  అధ్యక్షతన ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..గతంలో అంగీకరించిన విధంగా టీచర్ కు రెండు లక్షలు హెల్పర్ కి  లక్ష రూపాయలు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలని డిమాండ్ చేశారు. జీవో నెంబర్ 10 ని రద్దు చేయాలని న్యాయబద్ధమైన రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలి డిమాండ్ చేస్తూ తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ సీఐటీయూ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ధర్నా చౌక్ వద్ద  ధర్నా ద్వారా ప్రభుత్వానికి నిరసన తెలియజేస్తున్నామన్నారు. అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్ కు అత్యంత తక్కువ డబ్బులు చెల్లించి, జులై 1 నుంచి ఇంటికి పంపించే నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ విషయంలో ఎన్నికల ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయాలని , ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రి సీతక్క  టీచర్ కు రెండు లక్షలు హెల్పర్పు లక్ష రూపాయలు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇస్తామని వాగ్దానం చేశారని ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోతే పోరాటం తప్పదని ఆమె అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏకపక్షంగా సర్కులర్ ఇచ్చి 65 సంవత్సరాలు నిండిన వారిని బలవంతంగా ఇంటికి పంపించే నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని  సమ్మె సందర్భంగా గత ప్రభుత్వం ఇచ్చిన హామీల ప్రకారం టీచర్స్ కు 2 లక్షలు, హెల్పర్స్ కు 1 లక్ష చెల్లించాలి. విఆర్ఎస్ సౌకర్యం కల్పించాలి. తెలంగాణ రాష్ట్రంలో 65 సంవత్సరాలు పూర్తయిన  అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్  సుమారు 10 వేల మంది పనిచేస్తున్నారు. అంగన్వాడీ ఉద్యోగుల సమస్యలతో పాటు రిటైర్మెంట్ బెనిఫిట్స్ పెంచాలని 2023 సెప్టెంబర్ 11 నుండి అక్టోబర్ 4 వరకు రాష్ట్రంలో 24 రోజులు అంగన్వాడి ఉద్యోగులు నిరవధిక సమ్మె చేశారు.
ఈ సమ్మె సందర్భంగా గత బిఆర్ఎస్ ప్రభుత్వం అంగన్వాడీ టీచర్స్ కు 2 లక్షలు హెల్పర్స్ కు 1 లక్ష పెంచుతామని, పెన్షన్, విఆర్ఎస్ సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చింది. అనంతరం రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అంగన్వాడీ ఉద్యోగుల స్థితిగతులు, గత 24 రోజులు సమ్మె జరిగిన పరిస్థితి, ఆ సమ్మె సందర్భంగా గత ప్రభుత్వం ఇచ్చిన హామీలు, హామీల్లో ఒకటైన రిటైర్మెంట్ బెనిఫిట్స్ గురించి కూడా వివరంగా ప్రభుత్వం ఐసీడీఎస్ మంత్రి మరియు ఐసీడీఎస్ రాష్ట్ర అధికారుల దృష్టికి అనేకసార్లు తీసుకువచ్చాము. అయినా పై అంశాలను పరిగణలోకి తీసుకోక పోవడం అన్యాయం. పైగా రాష్ట్రంలో పనిచేస్తున్న అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్ మనోభావాలకు వ్యతిరేకంగా, ఏకపక్షంగా అతి తక్కువ డబ్బులు చెల్లించి, అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్ ను జులై 1 నుంచి ఇంటికి పంపించాలని నిర్ణయం చేయడం అత్యంత దుర్మార్గం. అంగన్వాడీ ఉద్యోగులకు తీవ్రమైన నష్టం కలిగించే ఈ నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే వెనక్కి తీసుకోవాలి. డిమాండ్ చేశారు సమస్యలను పరిష్కారం చేయకుంటే పోరాటాలను ఉదృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ జిల్లా జిల్లా  కార్యదర్శి  స్వర్ణ వాణి, రాజ్యలక్ష్మి హైమావతి ఆయాలు టీచర్లు పాల్గొన్నారు.