గ్రామాల్లో నెలకొన్న వివిధ విద్యుత్ సమస్యలుంటే వేంటనే విద్యుత్ శాఖ అధికారులకు సమాచారం అందించి పరిష్కరించు కోవాలని లైన్ మేన్ కపిల్ అన్నారు. ఇందల్ వాయి మండల కేంద్రంలోని తిర్మన్ పల్లి గ్రామంలో విద్యుత్ వినియోగదారులతో కలిసి పోస్టర్లను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యుత్ వారోత్సవాల్లో భాగంగా ప్రజలకు శనివారం అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 1 నుంచి 7వరకు విద్యుత్ వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు అయన వివరించారు.ఎప్పుడైన ఎదైన ఇబ్బందులు ఉంటే విద్యుత్ అధికారులకు సమాచారం అందజేయాలని సూచించారు.శాఖ అదికారులకు ఏలాంటి సమాచారం ఇవ్వకుండా వినియోగదారులు సొంతంగా ట్రాన్స్ఫర్, విద్యుత్ స్థాంబల వద్దకు వెళ్లి మరమ్మతులు చేసుకొని లేని ప్రమాదాలను కొని తెచ్చుకుని ఇబ్బందులకు గురికావొద్దని అన్నారు. విద్యుత్ను ఆదా చేయాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. కార్యక్రమంలో తిరునగరి శ్రీదర్, భాస్కర్,నిహల్ తో పాటు వినియోగదారులు తదితరులున్నారు.