మూడు వేల ఓటర్లుంటే.. మూడున్నర వేల ఓట్లేయండి

మూడు వేల ఓటర్లుంటే..
మూడున్నర వేల ఓట్లేయండి– రాజస్థాన్‌లోని చౌతాన్‌ బీజేపీ అభ్యర్థి వివాదాస్పద వ్యాఖ్యలు
జైపూర్‌ : బీజేపీ నేతలు, అభ్యర్థులు ఎన్నికల నియమనిబంధనల్ని తుంగలో తొక్కుతున్నారనటానికి సాక్ష్యం ఇది. రాజస్థాన్‌లోని బార్మర్‌ జిల్లా చౌతాన్‌ స్థానం నుంచి బరిలో ఉన్న బీజేపీ అభ్యర్థి అదు రామ్‌ మేఘ్వాల్‌ ” బూత్‌లో మూడు వేల మంది ఓటర్లుంటే 3.5 వేల ఓట్లు వేయండి. తర్వాత ఎన్నికల సంఘం విచారణ కొనసాగిస్తుంది, విచారణ నిర్వహించడమే వారి పని” అంటూ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. దీంతో రిటర్నింగ్‌ అధికారి అదురామ్‌కు నోటీసు జారీ చేసి, సమాధానం చెప్పాలని కోరారు. అదు రామ్‌ మాట్లాడుతూ ఇది నా మూడో ఎన్నిక, రెండుసార్లు ఓటమిని ఎదుర్కొన్నాను. మీరంతా ఏకతాటిపైకి వచ్చి ఎన్నికల్లో గెలిపించండి. బటన్‌ను నొక్కడం మిస్‌ అవ్వకండి. అని ప్రజలకు విజ్ఞప్తి చేసినట్లు చెబుతున్నారు.
బాబా బాల్కనాథ్‌ కూడా ….
గతంలో అల్వార్‌లోని తిజారా స్థానం నుంచి బీజేపీ అభ్యర్థి, ఎంపీ బాబా బాలక్‌నాథ్‌ కూడా ఇదే ప్రకటన చేశారు. వాళ్లు 100 ఓట్లకు 80 ఓట్లు వేస్తే, మేము 100కి 110 ఓట్లు వేస్తాము. ఈసారి ఈ స్ఫూర్తితో పనిచేయాలి. ఈసారి గ్రామంలో 1440 ఓట్లు పడగా.. 1450 ఓట్లు పోలయ్యాయి.