నవతెలంగాణ కంఠేశ్వర్ : జగజీత్ సింగ్ దల్లె వాలా ప్రాణాలకు ముప్పు వాటిల్లితే కేంద్ర ప్రభుత్వానిదే బాధ్యత అని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం, రైతు సంఘాల నాయకులు అని అన్నారు. ఈ మేరకు బుధవారం తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం, రైతు సంఘాల జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పెద్ది వెంకట్రాములు, తెలంగాణ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పల్లపు వెంకటేష్, నాయకులు దేవేందర్ సింగ్, శేఖర్ గౌడ్ లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పెద్ది వెంకట్రాములు, పల్లపు వెంకటేష్ మాట్లాడుతూ.. దొడ్డి దారిన మూడు నల్ల చట్టాలు తీసుకొచ్చి రైతాంగాన్ని, వ్యవసాయాన్ని మొత్తం కార్పొరేట్ సంస్థలకు కుదువ పెట్టే కుట్ర కేంద్ర బిజెపి ప్రభుత్వం చేసింది. ఆ సమయంలో హర్యానా, పంజాబ్ రైతాంగం 750 మంది ప్రాణాలు కోల్పోయినప్పటికీ, 14 నెలలు పోరాటం చేసి ప్రభుత్వం మెడలు వంచి నల్ల చట్టాలను రద్దు చేస్తూ కనీస మద్దతు ధర చట్టాన్ని తెస్తానని ప్రధానమంత్రి స్వయంగా రాతపూర్వక హామీ ఇచ్చారు. ఈ పోరాటంలో సంయుక్త కిసాన్ మోర్చా ఏర్పడి దేశవ్యాప్త పోరాటాలు, ఆందోళనలు చేసి మద్దతుగా నిలిచింది. మళ్లీ ఇప్పుడు ప్రధానమంత్రి అవే మూడు నల్ల చట్టాల సారాంశాన్ని పరోక్షంగా చాపకింది నీరు లాగా అమలు చేస్తున్నాడు. దీన్ని ముందుగానే గుర్తించిన రైతంగం అనేక ఆటంకాలు కలిగించినప్పటికీ, ఢిల్లీ సరిహద్దుల్లో దీక్షలు మళ్ళీ ప్రారంభించింది. ప్రభుత్వం చిత్తశుద్ధితోలేదు. రైతుల సమస్యలు పరిష్కారం చేయాలని రైతు నాయకుడు జగజ్జిత్ సింగ్ దల్లేవాలా ఆమరణ దీక్షకు పూనుకున్నాడు. నేటికీ 48 రోజులు గడుస్తుంది, పూర్తిగా ఆయన ఆరోగ్యం క్షీణించిపోయింది అయినా ఈ ప్రభుత్వానికి మాత్రం సోయి లేకుండా నిర్లక్ష్యం చేస్తుంది. ఒకవేళ దల్లేవాలా ప్రాణానికి ఏదైనా జరిగితే మోడీ ప్రభుత్వమే బాధ్యత వహించాలి హెచ్చరించాలన్నారు. అందుకని ఈ ప్రభుత్వం రైతాంగ సమస్యలను పూర్తిగా పరిష్కరించాలిని తెలంగాణ రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘాలు నిరసిస్తున్నాయి. ఎస్కేయం ఆధ్వర్యంలో జనవరి 26 తేదీన ట్రాక్టర్ పరేడ్ దేశవ్యాప్తంగా నిర్వహించాలని పిలుపునిచ్చింది. ఆ రోజున జరిగే సమరశీర పోరాటాన్ని ప్రభుత్వం చవిచూడాల్సి వస్తుందని హెచ్చరించారు. అయినా సమస్య పరిష్కారం కాకపోతే పోరాటాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.