హీరో త్రిగుణ్ నటించిన తాజా చిత్రం ‘లైన్ మ్యాన్’. ఈ చిత్రంతో ఆయన కన్నడ సినీ ఇండిస్టీలోనూ గ్రాండ్ ఎంట్రీ ఇవ్వటానికి సిద్ధమయ్యారు. వి. రఘుశాస్త్రి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా కన్నడ, తెలుగు భాషల్లో విడుదలకు సిద్ధమవుతుండటం విశేషం. పర్పల్ రాక్ ఎంటర్‌టైనర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ఈ చిత్రానికి ప్రచూర.పి, కాద్రి మణికాంత్, జ్యోతి రఘుశాస్త్రి, భళా స్టూడియో సహ నిర్మాతలు వ్యవహరిస్తున్నారు. ఈనెల 22న ఈ చిత్రం తెలుగు, కన్నడ భాషల్లో రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా హీరో త్రిగుణ్ సినిమా గురించి మాట్లాడుతూ,’ఇది ఫన్ ఎంటర్‌టైనర్‌గా ఉంటూనే మంచి మెసేజ్‌ను కూడా ఇస్తుంది. అది కూడా మన ప్రకతికి సంబంధించిన విషయం కావటంతో నాకు కనెక్ట్ అయ్యింది. అందుకే నేను ఈ కథను సెలక్ట్ చేసుకున్నాను. ఈ సినిమా ఓ ప్రత్యేకమైన చిత్రంగా నాకు ఎప్పటికీ గుర్తుండి పోతుంది. ఇప్పటి వరకు ఎవరూ టచ్ చేయనటువంటి కథ కూడా. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఓ గంటపాటు కరెంట్ పోతే మనమెంత బాధపడతామో తెలుసు. అలాంటిది ఓ గ్రామంలో పదిరోజుల పాటు కరెంట్ లేకుండా పోతే అక్కడి పరిస్థితులు ఎలా ఉంటా యనేది సినిమా. అయితే అన్నిరోజుల పాటు గ్రామంలో కరెంట్‌ను లైన్ మ్యాన్ ఎందుకు తీసేశాడనేది సినిమా. చిన్న హార్ట్ టచింగ్ మూమెంట్ ఉంటుంది. డైరెక్టర్ రఘుశాస్త్రిగారు మంచి రైటర్. ఆయన సినిమాను చక్కగా తెరకెక్కించారు. మనం మన పల్లెటూర్లో ఉన్నట్లే నేచురల్‌గా మాట్లాడుతున్నట్లే అనిపిస్తుంది. కామెడీ, చిన్న లవ్ పాయింట్‌తో పాటు హార్ట్ టచింగ్ మెసేజ్ కూడా ఈ చిత్రంలో ఉంటుంది’ అని తెలిపారు.