ఈ పోషకాలు తీసుకుంటే..

If these nutrients are taken..మహిళలు.. తమ రోజువారీ డైట్‌లో కచ్చితంగా తీసుకోవాల్సిన పోషకాలలో ఫోలేట్‌ ఒకటి. ఇది గుండె ఆరోగ్యం, నరాల పనితీరు, చర్మ ఆరోగ్యం, జీర్ణక్రియ, రక్త ప్రసరణ, ఉత్పత్తిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. గర్భధారణ సమయంలో, మహిళలు ఫోలెట్‌ కచ్చితంగా తీసుకోవాలని వైద్యులు సూచిస్తూ ఉంటారు. గర్భంలోని పిండం ఎదుగుదలకు, అభివద్ధికి అవసరమైన ముఖ్యమైన పోషకాలలో ఇది ఒకటి.
కాల్షియం..
మహిళలు వారి డైట్‌లో కాల్షియం రిచ్‌ ఫుడ్స్‌ కచ్చితంగా చేర్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. పాలు, పెరుగు, చీజ్‌ వంటి డైరీ ఉత్పత్తులలో కాల్షియం అధికంగా ఉంటుంది. పాలకూర వంటి ఆకుకూరల్లోనూ కాల్షియం అధికంగా ఉంటుంది.
ఐరన్‌..
ఐరన్‌ లోపంతో అలసట, బలహీనత వేధిస్తాయి. మహిళలు ఐరన్‌ రిచ్చ్‌ ఫుడ్స్‌ రోజూవారీ డైట్‌లో చేర్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. పౌల్ట్రీ, ఫిష్‌, నువ్వులు, బెల్లం, బీన్స్‌ వంటి ఆహార పదార్థాల్లో ఐరన్‌ సమద్ధిగా లభిస్తుంది. మన శరీరం ఆహారంలోని ఐరన్‌ను సమర్థవంతంగా గ్రహించుకోవడానికి.. విటమిన్‌ సి రిచ్‌ ఫుడ్స్‌ కూడా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.
విటమిన్‌ సి..
విటమిన్‌ సి ఇమ్యూనిటీని మెరుగుపరుస్తుంది, ఇన్ఫెక్షన్ల నుంచి శరీరాన్ని రక్షిస్తుంది. మీ డైట్‌ సిట్రస్‌ పండ్లు, స్ట్రాబెర్రీలు, బెల్‌ పెప్పర్స్‌, బ్రకోలీ వంటి విటమిన్‌ సి రిచ్‌ ఫుడ్స్‌ తీసుకోండి.
ఫైబర్‌..
ఫైబర్‌ బరువును కంట్రోల్‌లో ఉంచుతుంది, జీర్ణక్రియను ప్రోత్సహిస్తుంది, గుండె సమస్యలు, టైప్‌ 2 డయాబెటిస్‌ వంటి దీర్ఘకాలిక సమస్యల ముప్పును తగ్గిస్తుంది. మీరు ఫైబర్‌ను సమద్ధిగా పొందడానికి తణధాన్యాలు, పండ్లు, కూరగాయలు, చిక్కుళ్లు, నట్స్‌ వంటి ఆహారాలు మీ డైట్‌లో చేర్చుకోండి.
విటమిన్‌ డి..
విటమిన్‌ డి మహిళల శరీరంలో హార్మోన్‌గా పనిచేస్తుంది. మీరు విటమిన్‌ డిని సమద్ధిగా పొందడానికి ఉదయం, సాయంత్రం పూట కొంత సమయం సూర్యరశ్మిలో గడపండి. కాడ్‌, షార్క్‌ చేపల లివర్‌, పాలు, క్యాబేజీ, గుడ్డు పచ్చసొనలో విటమిన్‌ డి పుష్కలంగా లభిస్తుంది.
ప్రొటీన్‌..
ప్రోటీన్‌ కండర ద్రవ్యరాశి, రోగనిరోధక పనితీరు, కణజాల మరమ్మత్తుకు సహాయపడుతుంది. మహిళలు ఆరోగ్యంగా ఉండటానికి, రోజూ తగినంత ప్రొటీన్‌ కచ్చితంగా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. మాంసాలు, పౌల్ట్రీ, చేపలు, గుడ్లు, పాల ఉత్పత్తులు, కాయధాన్యాలు, సోయాలో ప్రొటీన్‌ అధికంగా ఉంటుంది.
పొటాషియం..
పొటాషియం ఒక ఎలక్ట్రోలైట్‌, ఇది రక్తపోటును కంట్రోల్‌లో ఉంచు తుంది. ఆరోగ్యకరమైన కండరాలు, నరాల పనితీరుకు సహాయపడుతుంది. పొటాషియం హైపర్‌టెన్షన్‌, స్ట్రోక్‌ ముప్పును తగ్గిస్తుంది. మీ రోజూవారి ఆహారంలో అరటి, కమల , బంగాళదుంపలు, పాలకూర, బీన్స్‌ వంటి పొటాషియం పుష్కలంగా ఉండే ఆహారాలు తీసుకోండి.