ఎస్సీ వర్గీకరణకు సహకరించకపోతే రెండు పార్టీలకు తగిన బుద్ధి చెప్తాం..

నవతెలంగాణ- చివ్వేంల: ఎస్సీ వర్గీకరణకు సహకరించకపోతే రెండు పార్టీలకు తగిన బుద్ధి చెప్తామని  ఎం ఎస్ పి రాష్ట్ర  నాయకులు  ఎర్ర వీరస్వామి అన్నారు. ఆదివారం   మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ముందు చేస్తున్న  రిలే నిరాహార దీక్ష లో పాల్గొని మాట్లాడారు. ఈ నెల  18 నుండి 22 వరకు జరిగే  పార్లమెంట్ సమావేశాలలో   బిజెపి ప్రభుత్వం   ఎస్సీ వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టేల కాంగ్రెస్ ఎంపి లు   పార్లమెంటులో  మాట్లాడాలని  కోరారు..  ఈ కార్యక్రమంలో చివ్వెంల మండల ఇంచార్జ్ బొడ్డు  విజయ్ కుమార్, మండల కన్వీనర్ చెరుకుపల్లి సతీష్,  ఏఐఎస్ఎఫ్   మాజీ జిల్లా అధ్యక్షుడు సిరపంగి నాగరాజు , నకరికంటి రవి , ఏర్పుల పృథ్వీరాజ్, బచ్చలి దుర్గ ప్రసాద్, ఏర్పుల మహేందర్ , సిరపంగి సైదులు ,  అశోక్ , బచ్చలి నాగయ్య , బచ్చలి వంశీ,  రామ్ తదితరులు పాల్గొన్నారు..