‘ట్రంప్‌ గెలిస్తే పుతిన్‌తో అవగాహనకు వస్తాడు : చెక్‌ ప్రెసిడెంట్‌

'ట్రంప్‌ గెలిస్తే పుతిన్‌తో అవగాహనకు వస్తాడు : చెక్‌ ప్రెసిడెంట్‌న్యూయార్క్‌ : డోనాల్డ్‌ ట్రంప్‌ అమెరికా అధ్యక్షుడయ్యే సాధ్యతవల్ల ఏర్పడే అననుకూల పర్యవ సానాలను ఎదుర్కొనేందుకు ఐరోపా దేశాలు సంసిద్దంగా ఉండాలని చెక్‌ ప్రెసిడెంట్‌ పీటర్‌ పావేల్‌ అన్నాడు. నవంబర్‌ లో జరిగే ఎన్నికల్లో రిపబ్లిక్‌ పార్టీ అభ్యర్థిగా ట్రంప్‌ గెలవటం జరిగితే ఆయన రష్యా అధ్యక్షుడు వ్లాడీమీర్‌ పుతిన్‌తో ఒక ఒప్పందానికి వచ్చే అవకాశం ఉంటుందని, అటు వంటి ఒప్పందం ఉక్రెయిన్‌ కు గానీ, ఐరోపా కుగానీ ఏవిధంగాను లాభసాటిగా ఉండదని ‘రేడియో జుర్నల్‌’ అనే రేడియో స్టేషన్‌ కి ఇచ్చిన ఒక ఇంటర్‌వ్యూ లో పావేల్‌ హెచ్చరించాడు. ”అమెరి కాతోగల స్నేహ సంబంధాలను చెడగొట్టా లనిగానీ, మిత్ర దేశమైన అమెరికాకు సవాలు విసరాలనిగానీ నేను అనటం లేదు. అయితే అనేక సమస్యలను డోనాల్డ్‌ ట్రంప్‌ వేరే విధంగా అర్థం చేసుకుంటున్నాడన్న విషయాన్ని మనం వాస్తవ దక్పథంతో అంగీకరించాలి. ఒకవేళ ట్రంప్‌ గెలిస్తే మనం అమెరికా ప్రజల నిర్ణయాన్ని గౌరవించాలి. అదే సమయంలో మనం దానితోవచ్చే పర్యవ సానాలను ఎదుర్కొనేందుకు సిద్దపడాలి” అని పావెల్‌ స్పష్టం చేశాడు.
ప్రస్తుత అమెరికా అధ్యక్షుడైన జో బైడెన్‌ లాగానే డోనాల్డ్‌ ట్రంప్‌ కూడా ఈ సంవత్సరం నవంబర్‌ లో జరగనున్నఎన్నికల్లో అధ్యక్ష పదవికోసం పోటీప డుతున్నారు. తాను అధికారంలోగనుక ఉండివుంటే అసలు ఉక్రెయిన్‌ యుద్ధమే జరిగేది కాదని ట్రంప్‌ అనేక సార్లు చెప్పాడు. తనకు రష్యా, ఉక్రెయిన్‌ నాయకులతో సత్సంబంధాలున్నాయని ఆయన పదేపదే చెబుతుంటాడు. యుద్ధాన్ని ముగించేందుకు చర్చించటానికి తాను సరియైన స్థితిలో ఉన్నానని కూడా ఆయన చెబుతున్నాడు. అయితే ట్రంప్‌ తన శాంతి ఒప్పంద స్వరూపం ఎలా ఉంటుందో ఎప్పుడూ చెప్పలేదు. ట్రంప్‌ ధోరణి చాలా ప్రమాదకరంగా ఉందని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వ్లాడీమీర్‌ జెలెన్‌స్కీ అన్నాడు. జాతీయ భద్రతా ప్యాకేజీ కింద 106బి ల్లియన్ల నిధుల ఆమోదం జరగకుండా రిపబ్లికన్లు అడ్డుపడ్డారు. దీనిలో 60బిల్లియన్లు ఉక్రెయిన్‌ కు అందించే సహాయం కోసం ఉద్దేశింపబడ్డాయి.