ఇంటి స్థలాలివ్వకపోతే ఎమ్మెల్యే ఇంటిని ముట్టడిస్తాం

నవతెలంగాణ-నేరేడుచర్ల
ప్రభుత్వ స్థలంలో పేదలకు ఇండ్ల పట్టాలు ఇవ్వాలని కోరుతూ 8 ఏండ్లుగా ఉద్యమిస్తున్నా పట్టించుకోని ఎమ్మెల్యే ఇంటిని ముట్టడిస్తామని సీపీఐఎంఎల్‌ ప్రజాపంథా జిల్లా కార్యదర్శి కొత్తపల్లి శివకుమార్‌ హెచ్చరించారు. పట్టణకేంద్రంలో పేదలకు ప్రభుత్వ భూమిని పంచాలని కోరుతూ జాతీయ రహదారిపై మంగళవారం ధర్నా నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిల్వ నీడలేని నిరుపేదలు ప్రభుత్వ భూములలో వేస్తే 11 మందిపై కేసులు పెట్టి జైలుకు పంపించారన్నారు.ప్రభుత్వ భూములపై పేదలకు హక్కుంటుందని రాజ్యాంగంలోనే ఉన్నదన్నారు.నేరేడుచర్ల పట్టణంలో 243,244 సర్వే నెంబర్లలో ప్రభుత్వ స్థలం ఉన్నదని, ఇల్లు లేని నిరుపేదలకు తలా 100 గజాలైన ఇవ్వాలని కోరుతూ నెలరోజుల కింద ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డిని కలువగా సమస్యను సమస్య పరిష్కరించి న్యాయం చేస్తానని హామీ ఇచ్చారని, ఇంతవరకు ఆ హామీ అమలు కాలేదన్నారు.ప్రభుత్వ భూమిని బీఆర్‌ఎస్‌ నాయకులు అక్రమంగా దోచుకుని రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేయాలని చూస్తున్నారని ఆరోపించారు.ఈ కార్యక్రమంలో పీఓడబ్ల్యూ జిల్లా కార్యదర్శి కొత్తపల్లి రేణుక,పీడీఎస్‌యూ జిల్లా కార్యదర్శి ఎర్రఅఖిల్‌, జిల్లా నాయకులు ల్లా కార్యదర్శి ఎర్ర అఖిల్‌, పార్టీ జిల్లా నాయకులు పేర్ల నాగన్న, నాయకులు పళ్లన్న పావని, హుస్సేన్‌, కర్నాకర్‌, మరియమ్మ, మాలాంబి, ఫాతిమా, సత్యక్క,కొమరయ్య, రమల నర్సమ్మ, ఆటో యూనియన్‌ జిల్లా కరీంనగర్‌ గోగుల వీరబాబు తదితరులు పాల్గొన్నారు.