24 గంటల్లో కూడవెళ్లి వాగుకు నీళ్లు విడుదల చేయకుంటే మేమే గేట్లు ఎత్తుతాం

– ఎమ్మెల్యే హరీశ్ రావు

– కాలం తెచ్చిన కరువు కాదు… కాంగ్రెస్ తెచ్చిన కరువు
– ఎండిన, వడగళ్ళకు నష్టపోయిన పంట ఎకరాకు రూ 25వేలు పరిహారం ఇవ్వాలి
– రైతులను ఆదుకోవాలని కలెక్టర్ మను చౌదరికి వినతి పత్రం అందించిన హరీశ్ రావు
నవతెలంగాణ – సిద్దిపేట
దుబ్బాక నియోజకవర్గం లోని కూడవెళ్లి వాగుకు వెంటనే నీళ్లు విడుదల చేయాలని, మంత్రుల దృష్టికి, ఇరిగేషన్ అధికారుల దృష్టికి మా ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి  తీసుకెళ్లారని, 24 గంటల్లో కూడవేళ్ళి వాగు కు నీళ్లు విడుదల చేయని పక్షం లో మల్లన్న సాగర్ ను ముట్టడిస్తాం.. మేమే గేట్లు ఎత్తుతాం  అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. మంగళవారం జిల్లా కలెక్టర్ మను చౌదరికి బిఆర్ఎస్ పార్టీ పక్షాన రైతుల ఆదుకోవాలని ఎమ్మెల్యే వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి బోగస్ మాటలను పక్కనపెట్టి రైతులు పండించిన పంటలకు బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కెసిఆర్ పొలం బాట పట్టిన తర్వాతనే కాంగ్రెస్ ప్రభుత్వం పంటల విషయంలో కళ్ళు తెరిచిందని అన్నారు. ఇది కాలం తెచ్చిన కరువు కాదని కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన కరువని అన్నారు. కెసిఆర్ ఈనెల 5న కరీంనగర్ వెళ్తున్నారని అందుకే ప్రభుత్వం గాయత్రి పంప్ హౌజ్ నుండి నీరును ఎత్తిపోస్తున్నారని, నాగార్జునసాగర్ కాలువ నుండి నీటిని విడుదల  చేస్తున్నారని అన్నారు. ప్రభుత్వ నీటి నిర్వహణ, విద్యుత్  వైఫల్యమే పంట నష్టం అని అన్నారు. దొంగలు పడ్డాక అరు నెళ్లకు కుక్కులు మోరిగినట్లుగా ఉంది సర్కారు తీరు అని ఆవేదన వ్యక్తం చేశారు. ఎండిపోయిన, వడగళ్ల వానకు నష్టపోయిన పంటలకు రూ.25 వేల నష్ట పరిహారం అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నాడు కె ఆర్ ఎం బి ప్రాజెక్టులను కేంద్రానికి అప్పజెప్పిన సందర్భంగా నేడు కెసిఆర్ పొలం బాట సందర్భంగా నే రాష్ట్ర ప్రభుత్వంలో చలనం వచ్చిందన్నారు.  కెసిఆర్ పోరాట ఫలితంగా రైతాంగానికి సాగు విడుదల చేసిందని స్పష్టం చేశారు.  రెండు లక్షల రుణమాఫీ, పదిహేను వేల రైతుబంధు, పంటలకు 500 బోనస్ పేరిట అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అన్నదాతలను దగా చేసిందన్నారు. బీ ఆర్ఎస్ పార్టీ అంటే భారత రైతు సమితి అన్నట్లుగా అధికారంలో ఉన్న, ప్రతిపక్షంలో ఉన్న రైతుల పక్షాన పోరాటం చేసిందని గుర్తు చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో రైతులు కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. కెసిఆర్ రైతుల పక్షాన పోరాటం చేస్తుంటే కాంగ్రెస్ మంత్రులు ఆ భద్రతాభావంతో ముప్పేట దాడికి దిగుతున్నారని మండిపడ్డారు.  కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయకుండా టిఆర్ఎస్ విమర్శించే హక్క లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ హామీల అమలుపై చర్చకు సిద్ధమని కాంగ్రెస్ మంత్రులకు సవాల్ విసిరారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ఒక్క మంచి పని కూడా చేయకుండా పథకాల్లో కోతలు పెట్టి వికృత ఆనందం పొందుతున్నారని దుయ్యబట్టారు. 200 మంది రైతుల ఆత్మహత్యలపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అవహేళనగా మాట్లాడడం సరికాదన్నారు. విపక్ష పార్టీ నాయకులపై కేసులు పెట్టడం పై ఉన్న శ్రద్ధ రైతులను ఆదుకోవడం పై కాంగ్రెస్ కు లేదని ఫైర్ అయ్యారు. తక్షణమే ఎండిపోయిన పంటలకు సాయం అందజేయాలని.. కాంగ్రెస్ పార్టీ మాదిరి ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేయమని  స్పష్టం చేశారు. వంద రోజుల్లో చేస్తానన్న హామీలు వెంటనే అమలు చేయాలని, ఎలక్షన్ కోడ్ ఉందని ఉత్తమ్ చావు కబురు చల్లగా చెప్పారని,  వంద రోజుల తరువాతే కోడ్ వచ్చిందన్నారు. కేసీఆర్ హయాంలో ఒక్క ఎకరా ఎండలేదని , కాంగ్రెస్ వచ్చాకే పంటలు ఎందుతున్నాయని అన్నారు. రైతులకు 24 గంటల నాణ్యమైన కరెంట్ ఇవ్వండని,  తక్షణమే రైతులకు ఇన్ పుట్ సబ్సిడీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ వచ్చాక నిల్లు తగ్గి రరైతుల్లో కన్నీళ్లు పెరిగినయని అన్నారు. రైతుల ఆత్మహత్యలను కూడా జోకులు వేస్తున్నారని బాధపడ్డారు.  విపక్ష నాయకుల ఇళ్లలోకి వెళ్లి పార్టీలో చేర్చుకునే శ్రద్ద రైతులకు నీళ్ళు ఇవ్వడంలో లేదన్నారు.  రైతులకు మేలు చేస్తే మేము అడ్డుకొమని అన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్ పర్సన్ రోజా రాధాకృష్ణ శర్మ, బిఆర్ఎస్ నాయకులు నాగిరెడ్డి, గుండు భూపేష్, రాజనర్సు, రవీందర్ రెడ్డి, వేణుగోపాల్ రెడ్డి, మాణిక్య రెడ్డి, బాలమల్లు, సారయ్య, సోమిరెడ్డి, రమేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.